ఇంకా ప్రజల దగ్గర్నుంచి బ్యాంకుకు తిరిగి రావాల్సిన డబ్బు చాలానే ఉంది అని ఆర్బిఐ స్పష్టం చేసింది. వ్యవస్థలో ఉన్న దాదాపు 76% వరకు ఈ రూ.2000 నోట్ల వెనక్కి వచ్చాయని తెలిపిన ఆర్బిఐ ప్రజలు బ్యాంకులో డిపాజిట్ చేయడం లేదా ఎక్స్చేంజ్ చేసుకోవడం లాంటివి చేశారు అని కూడా వివరించింది. అంతేకాదు ప్రజలు ఇంకా వారి వద్ద వున్న రూ.2000 నోట్లను బ్యాంకులకు వచ్చి మార్చుకోవాలని కూడా ఆర్బిఐ కోరుతోంది. సెప్టెంబర్ 30లోగా ఈ పని పూర్తి చేయాలి అని లేనిపక్షంలో ఆ నోట్లు చెల్లవు అని కూడా హెచ్చరించింది.
ఇకపోతే ఆర్బిఐ రూ .2000 నోట్ల ఉపసంహరణ అంశాన్ని మే 19వ తేదీన వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక అప్పటినుంచి చూసుకున్నట్లయితే జూన్ 30వ తేదీ నాటికి రూ.2000 నోట్ల చలామణి చాలా వరకు తగ్గింది. మే నెలలో చలామణిలో ఉన్న రూ .2000 నోట్ల విలువ రూ.3.56 లక్షల కోట్లు అయితే.. ఇప్పుడు చలామణిలో ఉన్న రూ.2000 నోట్ల విలువ రూ.84 వేల కోట్లకు తగ్గింది అని ఇక బ్యాంకుల్లోకి వచ్చిన రూ.2000 నోట్లను గమనించినట్లయితే వీటిల్లో 87% బ్యాంకు అకౌంట్ లలో జమ అయ్యాయని ఆర్బిఐ వెల్లడించింది .ఇకపోతే ఇంకా 13 శాతం మాత్రమే ఎక్స్చేంజ్ చేసుకున్నారు అని ఇక మిగిలిన డబ్బు కూడా సెప్టెంబర్ 30 లోపు బ్యాంకులకు వచ్చి చేరాలి అని ఆర్బిఐ సూచించింది.