తాజాగా ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చే ఉద్యోగులు,  కార్మికులకు అధిక పింఛన్ దరఖాస్తు గడువు ఈనెల 11వ తేదీతో ముగియబోతోంది. 2014 సెప్టెంబర్ ఒకటికి ముందు సర్వీస్ లో చేరి ఇప్పుడు ఈపీఎఫ్ఓ గరిష్ట వేతన పరిమితికి మించి వేతనం పొందుతూ ఈ మేరకు ఈపీఎఫ్ చందా చెల్లిస్తున్న ఉద్యోగుల నుంచి తాజాగా ఈపీఎఫ్ఓ ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా సుమారుగా 18 లక్షల వరకు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.. ఇకపోతే అధిక పింఛన్కు ఉమ్మడి ఆప్షన్ ఇవ్వడానికి నాలుగు నెలల గడువు ఇవ్వాలి అని సుప్రీంకోర్టు తెలపగా ఇప్పుడు ఆ గడువు కూడా ముగియబోతోంది.

ఇక మళ్లీ ఇంకొకసారి ఆ గడువును పొడిగించే అవకాశాలు లేవు అని.. అందుకే త్వరపడాలి అని ఈపీఎఫ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అధిక పింఛనుకు అర్హత కలిగి ఉండి పొందలేకపోతున్న చందాదారులకు దరఖాస్తు చేసేందుకు ప్రయత్నించి విఫలమైన వారికి ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయాల నుంచి ఫోన్లు కూడా వస్తున్నాయి ఇందుకోసం ప్రాంతీయ కార్యాలయాల్లో ప్రత్యేకంగా కాల్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది.. సెలవు రోజుల్లో కూడా చందాదారులకు సిబ్బంది ఫోన్లు చేసి మరి వివరాలు తెలుసుకుంటూ ఉండడం గమనార్హం ఎవరైనా సరే సాంకేతిక సమస్యలు ఎదురైనట్లయితే వెంటనే స్థానిక ప్రాంతీయ కార్యాలయాల్లో సంప్రదించాలని కూడా వారు సూచిస్తున్నారు..

ఇంకా మంగళవారం రోజు దరఖాస్తులకు చివరి రోజు కావడంతో సోమవారం కార్యాలయాల్లో అధికారులు అధిక పింఛన్ దరఖాస్తు సేవలు అందించడంతోపాటు చందాదారుల సందేహాలను కూడా నివృత్తి చేస్తున్నారు. ఇకపోతే 2014 సెప్టెంబర్ ఒకటికి ముందు పదవీ విరమణ పొందిన పింఛన్దారులకు సంబంధించిన దరఖాస్తులను ఇప్పుడు ఈపీఎఫ్ తిరస్కరిస్తుంది. అంతేకాదు 2014 సెప్టెంబరు ఒకటి కంటే ముందు పేరా 11(3) కింద అధిక పింఛన్ కోసం ఉమ్మడి ఆప్షన్ ఇవ్వని చందాదారులకు కూడా అర్హత లేదు అని నోటీసులు జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: