ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటిగా కొనసాగుతున్న బ్యాంక్ ఆఫ్ బరోడా తాజాగా మహిళలకు తీపి కబురును అందిస్తూ అదిరే ప్రకటన చేసింది. ముఖ్యంగా మహిళల కోసం స్పెషల్ పథకాలను అందు బాటులోకి తీసుకురావడం గమనార్హం . మహిళా సేవింగ్స్ సర్టిఫికెట్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు.. బ్యాంక్ ఆఫ్ బరోడా తాజాగా వెల్లడించింది. అందువల్ల ఈ స్కీం లో చేరాలని భావించేవారు. ఇప్పుడు బ్యాంకుకు వెళ్లి సులభంగానే అందులో చేరే అవకాశం ఉంటుంది.

ఇకపోతే మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీం  ను అందిస్తున్న మూడవ బ్యాంకు గా ఈ బ్యాంకు మహిళలకు మరింత చేరువ అవుతోంది. ఇప్పటికే కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి మహిళా కస్టమర్లను ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ స్కీమ్ పోస్ట్ ఆఫీస్ లో కూడా అందుబాటులో ఉండడం గమనార్హం. ఈ పథకంలో చేరితే 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఇది రెండు సంవత్సరాల పథకం. ముఖ్యంగా 2025 మార్చి 31 వరకే ఈ స్కీంలో చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి మహిళలు మాత్రమే ఈ స్కీంలో చేరడానికి అర్హులవుతారు.

ఇకపోతే చిన్నపిల్లల పేరుపై కూడా ఈ పథకంలో చేరే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఈ కొత్త పథకంలో చేరిన వారు రూ .2 లక్షల వరకు డబ్బులు దాచుకోవచ్చు లేదా ఒకేసారి డిపాజిట్ చేయవచ్చు లేదా ప్రతినెల కొంతమంది దాచుకోవచ్చు. ఉదాహరణకు రూ.20 వేల చొప్పున 10 సార్లు మీరు ఈ పథకంలో డబ్బులు దాచుకునే అవకాశం ఉంటుంది. అయితే ఒకసారి డబ్బులు డిపాజిట్ చేసిన తర్వాత మూడు నెలల వరకు వేచి ఉండాలి. మూడు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లిస్తారు. ఈ పథకంలో చేరిన సంవత్సరం తర్వాత అత్యవసరాలకు 40% విత్ డ్రా చేసుకోవచ్చు. అప్పుడు వారికి కేవలం 5.5% వడ్డీ రేటు మాత్రమే లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: