ప్రస్తుతం మహిళలు ఇంటి దగ్గరే ఉంటూ బోర్ కొడుతుందని ఏదైనా పని చేస్తే బాగుంటుంది అని ఆలోచించేవారు చాలా ఎక్కువమంది ఉన్నారు. అయితే వారు ఏం ఉద్యోగం చేయాలి? ఎలాంటి వ్యాపారం మొదలుపెట్టాలి దీన్ని పెడితే నష్టాలు లేకుండా లాభాల బాట పట్టవచ్చు అనే విషయాలపై అవగాహన లేక సతమతమవుతున్నారు. అయితే అలాంటి వారి కోసమే తాజాగా ఆరోహి సూయింగ్ ఎంటర్ప్రైజెస్ సంస్థ అందిస్తున్న లేటెస్ట్ ఎంబ్రాయిడరీ మిషన్ మహిళలను చైతన్య పరచడం కోసం ఒక సరికొత్త టెక్నాలజీని తీసుకురావడం జరిగింది.

ఈ విషయాన్ని ఆరోహి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శిరీష మల్లాడి వెల్లడించారు. తక్కువ బడ్జెట్ తో నటీనటులను తీసుకువచ్చి యాడ్ మేకింగ్ డైరెక్షన్ చేస్తున్న ధీరజ్ డ్రీమ్ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు చిన్న చిన్న వ్యాపారవేత్తలకు తక్కువ ఖర్చుతో ఇలా ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే విధంగా మార్గాలను చూపెడుతున్నారు. ఈ క్రమంలోనే సుధీర్ ధీరజ్ చేస్తున్న ఈ డైరెక్షన్ సమాజంలో చెప్పుకోదగిన విషయం ఇదే అని చెప్పాలి. ఇక ఈ ప్రోగ్రాం ప్రసాదు ల్యాబ్లో చాలా ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా హీరోయిన్ నందిత శ్వేత సినీ నటులు టీవీ కళాకారులు కూడా హాజరయ్యారు.

తాజాగా ఎవరు ఊహించని విధంగా మల్లాడి శిరీష మంగారావు ఆరోహి సూయింగ్ ఎంటర్ప్రైజెస్ సంస్థను నెలకొల్పి తమతో పాటు పదిమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగడం అందరిని ఆశ్చర్యాన్ని కలగిస్తుంది. తమతో పాటు సమాజానికి సమాంత సహకారం అందించాలని లక్ష్యంతోనే తాను ఉన్నానని మహిళలు స్టేజిపై ఉండడం కానీ దక్కిన గౌరవంగా భావిస్తూ ముందుకు వెళ్తానని మల్లాడి శిరీష వెల్లడించారు. తరాలు ఎన్ని మారిన కొత్త పోకడలు ఎన్ని వచ్చినా కుట్టుమిషన్ లేని జీవితాన్ని మనం ఊహించలేము. కుట్టు మిషన్ వచ్చిన తర్వాత మన జీవితం మరింత సుఖమయం అయింది. ఇప్పుడు అందరికీ ముఖ్యవసరంగా మారింది.  అందుకే కుట్టు మిషన్ ద్వారా ప్రతి మహిళ ఒకరిపై ఆధారపడకుండా తనకు తానే సంపాదించుకోవాలని అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నారు. వ్యాపారం చేయాలనుకునే మహిళలకు ఈ సంస్థ అండగా నిలబడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: