ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదింటి ఆడపిల్లల పెళ్ళికి అందించనున్న ఆర్థిక సహాయం నిధులను బుధవారం విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా నిధులను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈరోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి నగదు జమ చేయనున్నారు. ఏప్రిల్ - జూన్ 2023 త్రైమాసికం లో వివాహం చేసుకున్న అర్హులైన 18,883 జంటలకు రూ.141.60 కోట్ల ఆర్థిక సహాయాన్ని వధువు తల్లుల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు అందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.

ఎస్సీ ,ఎస్టీ, బీసీ, మైనారిటీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలలో ఆడపిల్లలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉండగా.. ముస్లిం మైనారిటీ వర్గాల ఆడపిల్లలకు వైయస్సార్ షాదీ తోఫా ద్వారా ఆర్థిక సహాయాన్ని ఏపీ ప్రభుత్వం అందిస్తోంది. పేద తల్లిదండ్రులు ఇప్పటివరకు తమ పిల్లలను చదివించి వారి వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించి.. తమ సామాజిక బాధ్యతను నిర్వర్తించడానికి ఏపీ ప్రభుత్వం ఇలా ఆర్థిక సహకారాన్ని అందిస్తోంది. ఇక ఈ పథకానికి అర్హత పొందాలి అంటే వధూవరులు ఇద్దరూ కూడా పదవ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి అయి ఉండాలి.

అంతేకాదు పెళ్లి నాటికి అమ్మాయి వయసు 18 ఏళ్లు.. అబ్బాయి వయసు 21 సంవత్సరాలు దాటి ఉండాలన్న నిబంధన కూడా ఉంది.. ప్రస్తుతం ఎస్సీలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైయస్సార్ షాదీ తోఫా కింద జగన్ ప్రభుత్వం అందిస్తున్న సహాయం లక్ష రూపాయలు.. ఎస్సీ కులాంతర వివాహాలకు వైసిపి ప్రభుత్వం అందించే సహాయాన్ని రూ.1,20,000. ఎస్టీలకు జగన్ ప్రభుత్వం రూ.1,00,000 అందిస్తూ ఉండగా గత ప్రభుత్వం ఎస్టీ కులాంతర వివాహాలకు రూ.75,000 ఇవ్వగా .. దానిని నేడు వైసిపి ప్రభుత్వం రూ.1,20,000 కి పెంచింది. బీసీలకు రూ .50,000 బీసీలలో కులాంతర వివాహం చేసుకున్న వారికి రూ.75,000 అందిస్తోంది. ఇక మైనారిటీలకు లక్ష రూపాయలు విభిన్న ప్రతిభావంతులకు అందిస్తున్న సహాయాన్ని రూ.1,50,000 కు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: