పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న పొదుపు పథకాలు ప్రజలకు డబ్బులు దాచుకునే విధంగా భారీగా సహాయం చేస్తున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్ ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ లో అందుబాటులో ఉన్న రికరింగ్ డిపాజిట్ స్కీమ్ వడ్డీ రేటు 30 బేసిస్ పాయింట్స్ పెరిగి.. గతంలో 6.2 శాతంగా ఉన్న వడ్డీని 6.5శాతంగా చేసింది కేంద్ర ప్రభుత్వం. 2023 జూలై - సెప్టెంబర్ కాలానికి ఈ వడ్డీ రేటు వర్తిస్తుందని చెప్పవచ్చు. ఇకపోతే పదేళ్లపాటు ప్రతి నెల కొంత మొత్తం పొదుపు చేయాలనుకునే వారికి ఈ పథకం బాగా ఉపయోగపడుతుంది.

ఎటువంటి రిస్క్ లేకుండా రిటర్న్స్ పొందడంలో ఈ పథకం మీకు బాగా సహాయపడుతుందని చెప్పవచ్చు. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం అనేది ప్రతి పోస్ట్ ఆఫీస్ లో అందుబాటులో ఉన్న నేపథ్యంలో 18 సంవత్సరాల దాటిన వారు ఎవరైనా సరే ఈ పథకంలో చేరవచ్చు. అంతేకాదు ముగ్గురు వ్యక్తులు కలిసి జాయింట్ అకౌంట్ కూడా ఓపెన్ చేసి పథకంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయవచ్చు. నెలకు కనీసం వంద రూపాయల నుంచి.. గరిష్టంగా ఎంతైనా పొదుపు చేసే అవకాశం ఉంటుంది. మొదట ఐదు సంవత్సరాల కాలానికి రికరింగ్ డిపాజిట్ అకౌంట్ తెరిచి ఆ తర్వాత మరో ఐదేళ్లు ఈ ఖాతాను పొడిగించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 6.5% వడ్డీ లభిస్తుంది.ఈ నేపథ్యంలో భారీ రిటర్న్స్ పొందవచ్చు.

ఉదాహరణకు నెలకు రూ.5000 చొప్పున 10 సంవత్సరాలు పొదుపు చేస్తే..మీరు పొదుపు చేసిన మొత్తం రూ.6లక్షల అయితే వడ్డీ రూ.2.46 లక్షలు లభిస్తుంది. ఒకవేళ ప్రభుత్వం వడ్డీ రేట్లు పెంచితే ఈ అమౌంట్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇకపోతే అకౌంట్ తెరిచిన ఏడాది తర్వాత 50% లోన్ కూడా మీరు పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: