మీరు కూడా ఈ పథకం ద్వారా ప్రయోజనాలను పొందాలి అంటే.. ఈ పథకం యొక్క పూర్తి వివరాలు, దరఖాస్తు ప్రక్రియ గురించి ఇప్పుడు చూద్దాం. వ్యవసాయ సంబంధిత పనులను పూర్తి చేయడానికి ఈ పథకం ద్వారా రూ.3లక్షల వరకు లోన్ పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దీనికోసం మీరు ఎటువంటి తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. తక్కువ వడ్డీకి రుణాలు పొందవచ్చు. రైతులు ఈ పథకం ద్వారా రూ.3 లక్షల వరకు గ్యారెంటీ లేని రుణాన్ని పొందితే ఆ మొత్తం పై ప్రభుత్వం రైతుల నుంచి 4 శాతం వడ్డీని మాత్రమే వసూలు చేస్తుంది.
నాబార్డ్ సహకారంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ పథకాన్ని ప్రారంభించింది. ముఖ్యంగా భారతదేశంలో వ్యవసాయం చేస్తున్న ఎవరైనా సరే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. 18 ఏళ్ల నుంచి 75 ఏళ్ల వరకు వయసున్న ఏ ఒక్క రైతైనా ఇందులో చేరి డబ్బు పొందే అవకాశం ఉంటుంది. ఇక ఇందులో డబ్బు తీసుకున్న తర్వాత ఐదు సంవత్సరాలలో చెల్లించాల్సి ఉంటుంది. రైతులు ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీం కోసం ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇక కావలసిన డాక్యుమెంట్స్ విషయానికి వస్తే.. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, వాహనం లైసెన్స్ , భూమి పత్రాలు, పాస్పోర్ట్ సైజు ఫోటో తప్పనిసరి. వీటిని ఉపయోగించి మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసినా లేదా దగ్గరలో ఉన్న బ్యాంకుకు వెళ్లి సమర్పించిన లోన్ పొందే అవకాశం ఉంటుంది.