
ఆవు పాలు ప్రస్తుతం మార్కెట్లో మహా అయితే ₹100 పలుకుతున్నాయి. కానీ గాడిద పాలు మాత్రం లీటర్ 7000 వరకు పలుకుతూ ఉండడం గమనార్హం. అదేంటి గాడిద పాలకు అంత డిమాండ్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు కదా.. అయితే గాడిద పాలకు అంత డిమాండ్ రావడానికి వెనుక ఉన్న కారణం ఏంటో తెలిస్తే.. ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతారు. సాదరణంగా పిల్లలు పుట్టిన తర్వాత వారికి గాడిద పాలు పోస్తూ ఉంటారు. ఇది చాలా కాలంగా వస్తుంది. అయితే గాడిద పాలు తాగిస్తే పిల్లలు పెరిగే కొద్దీ మరింత చురుగ్గా అవుతారని ఎంతోమంది నమ్ముతారు.
కాలక్రమంలో ఇది మరుగున పడిపోయింది. దీంతో చాలామంది గాడిద పాలును లెక్క చేయడమే మానేశారు. కానీ ఇప్పుడు మరుగున పడిన ఈ పాత సాంప్రదాయాన్ని.. మళ్లీ తెరమిదికి తెస్తూ ఉన్నారు ఎంతోమంది. ఈ క్రమంలోనే గాడిద పాలకు ఎక్కడా లేని డిమాండ్ వస్తుంది. ఈ క్రమంలోనే మార్కెట్లో ఉన్న డిమాండ్ ని క్యాష్ చేసుకుంటున్నా ఎంతో మంది గాడిదలకు ఏకంగా ప్రత్యేకంగా ఫామ్ కూడా ఏర్పాటు చేశారు అని చెప్పాలి. ఇక ఒక లీటర్ గాడిద పాలు 7వేల రూపాయల వరకు అమ్ముతూ ఉన్నారు. హిందూపురం చుట్టుపక్కల గ్రామాలకు పొద్దున్నే గాడిదలను తీసుకొచ్చి ఇంటి ముందు పాలు పితికిస్తున్నారు.