
ఇప్పటికే రైతులకు రూ.7500 సహాయం చొప్పున రూ.109.74 కోట్ల సహాయం పంపిణీ చేయనున్నారు.. ఈరోజు ఉదయం 10 గంటలకు తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో జరగబోతున్న కార్యక్రమంలో.. కార్యక్రమం పూర్తిగా ముగిసిన తరువాత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి రైతుల ఖాతాలకు నేరుగా ఈ సహాయాన్ని అందించబోతున్నారు. ఇకపోతే రాష్ట్రంలోని భూ యజమానులకు వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద ప్రతి ఏటా రూ .13,500 చొప్పున పెట్టుబడి సహాయాన్ని అందిస్తుండగా.. మే నెలలో రూ.7,500, అక్టోబర్ నెలలో రూ.4,000, జనవరిలో మరో రూ.2వేలు చొప్పున 3 విడతల్లో ఈ సహాయాన్ని అందజేస్తుంది.
అదేవిధంగా ఇప్పుడు దేశంలో ఎక్కడా లేనివిధంగా భూమిలేని ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కవులు రైతు కౌలు కుటుంబాలతో పాటు అటవీ దేవాదాయ భూమి సాగు దారులకు కూడా ఇప్పుడు రూ .13,500 చొప్పున పెట్టుబడి సహాయాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తమ నిధులతోనే అందజేస్తుంది. మొత్తంగా అందరికీ కలిపి ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 52.57 లక్షల రైతు కుటుంబాలకు రూ.31,005.04 కోట్ల మీద పెట్టుబడి సహాయాన్ని అందించినట్లు తెలుస్తోంది.