రైతన్నల కోసం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని తీసుకొచ్చి ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతన్నలకు ఆర్థికంగా అండగా కేంద్ర ప్రభుత్వం నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ పథకం కింద అన్నదాతలకు ప్రతి ఏటా డబ్బులు ఉచితంగా అందజేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బ్యాంకు అకౌంట్లోకి రూ.2,000 చొప్పున జమ అవుతున్నాయి. అంటే ఏడాదికి రూ.6,000 చొప్పున 3 విడతల్లో పీఎం కిసాన్ డబ్బులు రైతన్నలు సొంతం చేసుకుంటున్నారు.

ముఖ్యంగా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 14 విడతల డబ్బులను రైతుల ఖాతాలో నేరుగా జమ చేయగా అంటే మొత్తం 28 వేల రూపాయలను రైతన్నల ఖాతాలో కేంద్ర ప్రభుత్వం జమ చేసింది. ఇప్పుడు 15వ విడత డబ్బులు అందాల్సి ఉండగా మరో రూ.2,000 రానున్నాయి. ఇక ఇవి కూడా వచ్చేస్తే మొత్తం రూ.30,000 రైతన్నలకు పిఎం కిసాన్ స్కీం కింద వచ్చినట్లు అవుతుంది. అయితే ఈ 15వ విడత డబ్బులు నవంబర్ లేదా డిసెంబర్ నెలలో బ్యాంక్ అకౌంట్ లోకి రావచ్చు అని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం 2000 రూపాయలు లభిస్తున్న నేపథ్యంలో.. ప్రభుత్వం ఎలక్షన్లు రాబోతున్న క్రమంలో రూ .3వేలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఒకవేళ ఇదే నిజమైతే రూ .3వేల చొప్పున 3 విడతల్లో రైతన్నల ఖాతాల్లో  రూ.9వేలకు చేరుతుంది. తాజాగా మీడియా నివేదికల ప్రకారం ఇప్పటికే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కు ఈ పెంపు ప్రతిపాదన చేరిందని , ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే ఇన్స్టాల్మెంట్ మొత్తం కూడా ఎక్కువ కావచ్చు అని సమాచారం. అయితే ఈ అంశంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇదిలా ఉండగా ఇటీవల మోడీ సర్కారు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించిన విషయం తెలిసిందే.  మరొకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి.  అందుకే పీఎం కిసాన్ డబ్బులను కూడా కేంద్రం పెంచవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: