ప్రస్తుత కాలంలో హడావిడి జీవితాన్ని చాలామంది గడుపుతున్నారు. ఒకప్పుడు పెళ్లి అంటే బంధు మిత్రుల సందడి మధ్య పది రోజులపాటు పండగ లాగ జరిగేది. అయితే ఇప్పుడు ఉరుకుల పరుకుల జీవితంలో మరీ ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత పెళ్లి సమయానికి వచ్చి పోవడమే ఇప్పుడు కష్టంగా మారిన పరిస్థితి అని చెప్పవచ్చు. ఇక ఈ నేపథ్యంలోనే వెడ్డింగ్ ప్లానర్స్ సంస్కృతి అందుబాటులోకి వచ్చింది. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ వెడ్డింగ్ ప్లానర్ అందరినీ బాగా ఆకర్షిస్తుందని చెప్పవచ్చు. అలంకరణ, వేదిక , భోజనాలు ఇలా అన్నింటిని కూడా వారే చూసుకుంటారు .

అయితే అందుకు సరిపడా డబ్బులను ముందే మాట్లాడుకొని వారికి చెల్లిస్తే సరిపోతుంది. ముఖ్యంగా వెడ్డింగ్ ప్లానర్స్ లో చాలా రకాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో టెంట్ ,వెయిటర్,  ఆహారం వంటి ప్రాథమిక వివాహ సౌకర్యాలను అందిస్తే.. మరి కొంతమంది మొత్తం పెళ్లిని వారే ప్లాన్ చేస్తారు.  పెళ్లికి సంబంధించిన ప్రతి చిన్న పనిని కూడా వారే చూసుకుంటారు. అందుకే ఇప్పుడు చాలామందికి వెడ్డింగ్ ప్లానర్ అనేది కెరియర్ ఆప్షన్ గా మారింది.  రోజురోజుకు డిమాండ్ పెరిగిపోతున్న నేపథ్యంలో వ్యాపారం చేయాలనుకుంటే వెడ్డింగ్ ప్లానింగ్ సంబంధించి ఏదైనా కోర్స్ లేదా డిప్లమా చేస్తే సరిపోతుంది . చాలా ఇన్స్టిట్యూట్ లు ఇందుకు సంబంధించిన ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సును అందిస్తున్నాయి.

వెడ్డింగ్ ప్లానర్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ కోర్సు చాలా బాగా ఉపయోగపడుతుంది లేదా మీరు వెడ్డింగ్ ప్లానర్ కంపెనీలో ఉద్యోగం చేసి కూడా అనుభవాన్ని సంపాదించవచ్చు.ప్రారంభంలో మీరు ఇంటి వద్ద ఉండి కూడా కార్యాలయాన్ని తయారు చేసి దీని ద్వారా భోజనాలు, టెంట్ హౌస్, వివాహ అలంకరణ, డిజె సౌండ్, బ్యాండ్ వంటివి అందించే వ్యక్తులతో మాట్లాడుకొని అగ్రిమెంట్ చేసుకోవాలి. ఇక మీరు వీరిని కమిషన్ బేస్ ను నియమించుకోవచ్చు. ఇక పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. ప్రారంభంలో కస్టమర్ నుంచి అడ్వాన్స్ తీసుకొని మీరు పని మొదలు పెట్టవచ్చు. ఎంత లేదన్నా ఏడాదికి రెండు మూడు సార్లు వివాహ సీజన్ లు వస్తాయి.. కాబట్టి మంచి పరిచయాలు ఉంటే నాణ్యమైన సేవను అందించి భారీ లాభాన్ని పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: