పూర్తి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనా రూ.18.28 లక్షల కోట్లలో ఇది 47.45 శాతం. అంటే ఏడాదికి పన్నుల రూపంలో రూ.18.28లక్షల కోట్లు వస్తుండగా ఇప్పటికే ఆరు నెలలకే రూ.8.65లక్షల కోట్లు వచ్చేశాయి. (మన ఆర్థిక సంవత్సరం మార్చితో మొదలవుతుంది).
ఇందులో కార్పొరేట్ ఆదాయ పన్నులు రూ. 4,16,217 కోట్లు. సెక్యూరిటీ లావాదేవీల పన్నులతో కలిపి వ్యక్తిగత ఆదాయపు పన్ను రూ.4,47,291కోట్లుగా ఉన్నాయి. సెప్టెంబరు మధ్య నాటికి ముందస్తు పన్ను చెల్లింపులు రూ.3.55లక్షల కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే ఆర్థిక సంవత్సరంలో 2.94లక్షల కోట్లు పన్నులు వసూలు అయ్యాయి. ముందస్తు చెల్లిపులు 21 శాతం మేర పెరిగాయి.
పన్నుల వసూళ్లలో స్థిరమైన వృద్ధి ఇందుకు దోహదం చేశాయి. ముందస్తు పన్నుల చెల్లింపులకు సెప్టెంబరు 15తో గడువు ముగిసింది. ముందస్తు పన్ను చెల్లింపు రూ.3.55లక్షల కోట్లలో కార్పొరేట్ ఆదాయ పన్ను రూ. 2.8 లక్షల కోట్లు, వ్యక్తిగత పన్ను చెల్లింపులు రూ.74, 858 కోట్లుగా నమోదైంది. సెప్టెంబరు 16 నాటికి మొత్తం 1.22 లక్షల కోట్లు రిఫండులు జారీ అయ్యాయి. స్థూలంగా చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.9.78 లక్షల కోట్లుగా నమోదైంది. అంతకు ముందు ఇదే ఆర్థిక సంవత్సరంలో రూ. 8.34లక్షల కోట్లు వసూలయ్యాయి. క్రితం సారితో పోల్చితే 18.9 శాతం మేర పెరిగాయి