తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ రైతులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ప్రతీ నెలా క్రమం తప్పకుండా వారి ఖాతాలో జమ చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ విషయం ప్రకటిస్తారని ఆ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు రైతులకు, రైతు కూలీలకు కూడా ప్రతి నెల రూ.5,000 చొప్పున వారికి ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇకపోతే నిన్నటి వరకు హ్యాట్రిక్ విజయం ఖాయం అన్న ధీమాతో ఉన్న బీఆర్ఎస్ కి ఓటమి భయం ఇప్పుడు కీలక కారణమని.. దానితోపాటు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ప్రజల్లోకి చొచ్చుకుపోవడం తెలంగాణలో తాజా సర్వే ఫలితాలు బీఆర్ఎస్ కి ప్రతికూలంగా వెలువడుతుండడంతో ఈ బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేసుకోవడం వెనుక కారణాలుగా విశ్లేషకులు కూడా చెబుతున్నారు.

ఇక ప్రతికూల పరిణామాలను దీటుగా ఎలా ఎదుర్కోవాలన్న అంశం ఇప్పుడు కేంద్ర బిందువుగా బీఆర్ఎస్ మేనిఫెస్టో రూపకల్పన పనులు ప్రగతి భవన్ లో ముమ్మరంగా సాగుతున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే రైతులను తమ వైపు తిప్పుకునే దశగా రైతులకు వేతనాలు అన్న అంశాన్ని ముందుకు తీసుకొచ్చారని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు త్వరలో బీఆర్ఎస్ నుంచి ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే మ్యానిఫెస్టో వస్తుందని హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ దిమ్మతిరిగే అంశం ఇదే కావచ్చని కూడా తెలుస్తోంది.

ముఖ్యంగా రైతులు , నిరుద్యోగులు,  మహిళలు కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలకు బాగా ఆకర్షితులవుతున్నారని తాజా సర్వేలో వెళ్లడవ్వగా.. ఇప్పుడు బీఆర్ఎస్ వారిని తమ వైపు తిప్పుకునే విధంగా రైతులకు నెల నెల జీతం అని ఒక కొత్త పథకాన్ని తీసుకురాబోతోంది.  భూమి ఉన్న ప్రతి రైతుకు ప్రతి నెల 5000 రూపాయల జీతం ఇవ్వడం అలాగే రైతు కూలీలకు కూడా కొన్ని షరతులతో అంతే మొత్తాన్ని ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ సృష్టించిన ఆరు గ్యారెంటీల పోటీని తట్టుకోవచ్చని బిఆర్ఎస్ అధినాయకత్వం భావిస్తోందట. మరి ఏ మేరకు వీరి మేనిఫెస్టోలో సక్సెస్ అవుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: