దేశ ఆర్థిక పురోగతిలో కీలకపాత్ర పోషిస్తున్న రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తీసుకొచ్చింది. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులను ఎక్స్పోర్ట్ చేయడంతో పాటు దేశ ప్రజల ఆకలిని తీర్చే రైతులకు సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం 2019లో పిఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద అర్హులైన రైతులు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి 2000 రూపాయలను నేరుగా తమ ఖాతాలో పొందుతున్నారు. అంటే సంవత్సరానికి రూ.6000 తమ ఖాతాలో పొందుతూ ఉండడం గమనార్హం.

 ఇకపోతే ప్రతి సంవత్సరం ఏప్రిల్ - జూలై , ఆగస్టు - నవంబర్, డిసెంబర్ - మార్చి నెలల్లో మూడు వాయిదాలలో రైతుల బ్యాంకు ఖాతాలకు ఈ డబ్బును కేంద్ర ప్రభుత్వం బదిలీ చేస్తుంది. ఇకపోతే ఇప్పటివరకు పీఎం కిసాన్ పథకం కింద ప్రభుత్వం ఏకంగా రూ.2.50 లక్షల కోట్లను లబ్ధిదారులకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద 15వ విడత కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు శుభవార్తను తెలుపుతూ త్వరలోనే ఆ డబ్బును విడుదల చేస్తామని కూడా ప్రకటించింది.

ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన 14వ విడతను ఈ  ఏడాది జులైలో ప్రధానమంత్రి విడుదల చేయగా .. 15వ విడత డబ్బును నవంబర్ చివరి వారంలో బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే మీరు ఈ పథకం నుంచి లబ్ధి పొందుతున్నారో లేదో తనిఖీ చేయడానికి ఒక ప్రత్యేకమైన వెబ్ సైట్ ను కూడా ప్రభుత్వం రూపొందించింది. కాబట్టి ఇందుకు సంబంధించిన అనుమానాలను మీరు నివృత్తి చేసుకోవచ్చు. అర్హులై ఉండి ఉంటే ఈ పీఎం కిసాన్ కి సంబంధించిన పథకానికి పీఎం కిసాన్ వెబ్సైట్ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తానికి అయితే దీపావళి పండుగ రానున్న నేపథ్యంలో నవంబర్ చివరి వారంలో రైతుల ఖాతాలో 2000 రూపాయలు ప్రభుత్వం జమ చేయబోతుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: