ఈ ఏడాది దీపావళి పండుగ సందర్భంగా ఎవరైనా కొత్త బైక్ కొనాలనుకునే వారికి ఒక గుడ్ న్యూస్ అందిస్తోంది దిగ్గజ టు వీలర్ కంపెనీ..HERO గిఫ్ట్ గ్రాండ్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫ్ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది.. ఈ గిఫ్ట్ స్కీమ్ ద్వారా అన్ని రకాల హీరో బైకుల పైన ఇన్సూరెన్స్ ప్రయోజనాలతో పాటు బైనౌ పేలెటర్ వంటి వాటి పైన కూడా తక్కువ ధరకే అందిస్తోంది..EMI , క్యాష్ వాటిపైన ఐదేళ్ల స్టాండర్డ్ వారంటీ వంటి స్కీమును కూడా తీసుకురావడం జరిగింది. దివాళి పండుగ సందర్భంగా అదనపు ప్రయోజనాలను కల్పిస్తోంది హీరో సంస్థ వాటి గురించి తెలుసుకుందాం.
హీరో బైక్స్ కొన్నవారికి అదనంగా 5,500 డిస్కౌంట్ ని అందిస్తున్నారు నగదు బోనస్ కింద 3000 రూపాయల వరకు అందించగా ఎక్స్చేంజ్ బోనస్ కింద మిగతా వాటిని అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు తీసుకున్న బైక్ కి 2024 లో డబ్బులు చెల్లించండి అంటూ ఫైనాన్స్ పథకాలను కూడా ప్రవేశపట్టడం జరిగింది. దీంతో ఎవరైనా పండుగకి బైక్ లేదా స్కూటర్ ని కొనాలనుకునే వారికి అతి తక్కువ వడ్డీ రేటుకి వాహనాలను అందిస్తున్నట్లుగా తెలుపుతోంది. వడ్డీ రేటు గరిష్టంగా 6.99 మాత్రమే ఉంచారు. స్కూటర్లు, బైకులకు న్యూ కలర్స్ ఆప్షన్లు ఉంటాయని తెలియజేస్తున్నారు. పూర్తి సమాచారం కోసం ఏదైనా హీరో షోరూం దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది.