మన భారతీయ కుటుంబస్వామ్య పద్ధతిలో చాలామంది సైతం గతంలో డబ్బులను దాచుకునేవారు కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా బీమా పాలసీలను ఎక్కువగా కుటుంబాలను ఆదుకుంటూ ఉన్నాయి. ఎక్కువమంది ఎల్ఐసి ద్వారా పలు రకాల పాలసీలను కడుతూ ఉన్నారు. అయితే ఈ జీవిత బీమా పాలసీ ప్రతి ఏడాది రెన్యువల్ చేసుకోవడం చాలా ముఖ్యము. ఇది చాలా సమయాలలో ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అయితే సకాలంలో మనం ఈ పాలసీని పునరుద్దించకపోతే ల్యాప్స్ అయిపోతుంది. అలా ల్యాప్స్ అయిపోయిన పాలసీని పునరుద్దించుకోవడం చాలా కష్టము.. అయితే కొన్ని టిప్స్ వాడడం వల్ల చేసుకొనే అవకాశం ఉంటుంది.


సాధారణంగా బీమా కంపెనీలు సైతం ఎక్కువగా రెండు సంవత్సరాలు మాత్రమే ఈ అవకాశం ఉండేలా చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో పాలసీదారులు తమ ల్యాప్స్ అయిన పాలసీని పునరుద్ధరణ చేసుకోవచ్చు.. నిర్ణీత రోజులలో ప్రీమియం చెల్లించకపోతే బీమా పాలసీ గడువు ముగుస్తుంది.. బీమా పాలసీ అన్ని ప్రీమియం చెల్లిస్తున్నప్పుడు ప్లాన్ నిబంధనలకు అనుగుణంగా ల్యాప్స్ అయితే పాలసీని మళ్ళీ యాక్టివేట్ చేసుకుని అవకాశం ఉంటుంది.. అయితే ఈ ఎల్ఐసి ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రద్దు చేసిన పాలసీని తిరిగి చేయడాన్ని లేదా తిరస్కరించే అధికారాన్ని సైతం నిర్వహిస్తుంది.


పాలసీదారులు తమ ప్రీమియంను చెల్లించడానికి 15 నుంచి 30 రోజుల వరకు గ్రేస్ పీడియారని ఇస్తుంది. ఈ సమయంలో కూడా చెల్లించ లేకపోతే విఫలమవుతుంది


అయితే పాలసీదారుడు ఆలస్యమైన అసలు వడ్డీని నేరుగా బీమా కంపెనీకి చెల్లించడం ద్వారా మళ్లీ పునరుద్ధరణ చేసుకోవచ్చు.



 పాలసీదారుల ఏజెంట్ కు కాల్ చేయడం లేదా బ్రాంచ్ ను సందర్శించడం ద్వారా ఎల్ఐసి బీమాను సైతం మళ్లీ పునరుద్ధరణ చేసుకోవచ్చు. అయితే ఇది రెండు లేదా ఏడాది లోపు మాత్రమే చేసుకుని అవకాశం ఉంటుంది.


పాలసీని రివైజ్ చేయడానికి పలు రకాల పత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా వైద్య నివేదికల ఖర్చును సైతం చూపించాల్సి ఉంటుంది.


ఇలాంటి బీమా పథకాలను సైతం ఎట్టి పరిస్థితిలోనూ నిర్లక్ష్యం చేయకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: