రైతులను.. వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు భరోసా , పీఎం కిసాన్ పేర్ల పైన డబ్బు నేరుగా అర్హులైన రైతుల ఖాతాలో జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక నిన్నటి నెలలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతులకు రైతు భరోసా పథకం కింద రెండు వేల రూపాయలు జమ అయ్యాయి. ఇప్పుడు పీఎం కిసాన్ డబ్బులు కూడా రైతుల ఖాతాల్లోకి జమ కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సహాయం కింద ప్రతి సంవత్సరం 6000 రూపాయలను అందిస్తున్న నేపథ్యంలో పంట పెట్టబడికి , వ్యవసాయానికి సంబంధించి ఎరువులు కొనుగోలుకు ఆర్థిక సహాయం కోసం ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

ఇందులో భూమి కలిగి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి ప్రతి ఏడాది నాలుగు నెలలకు ఒకసారి రూ.2000 చొప్పున మూడు సమాన వాయిదాలలో 6000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కేంద్రం అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం లబ్ధిదారులు వారి బ్యాంకు ఖాతా వివరాలకు ఆధార్ నంబర్తో అనుసంధానం చేయాలని కూడా సూచించడం జరిగింది. ఇక ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి
యోజన పథకానికి సంబంధించి 15వ విడత డబ్బులను అతి త్వరలో రైతుల ఖాతాలో జమ చేయనుంది.

దీపావళి తర్వాత అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేసే అవకాశం ఉంది. ఇక ఏడాది జూలైలో సెంట్రల్ సెక్టార్ స్కీంకి సంబంధించి 14వ విడత నిధులను విడుదల చేయగా.. ఈ పథకం కింద డబ్బులు పొందాలి అంటే ఆధార్ తో బ్యాంకు వివరాలను లింకు చేయడానికి ఈ కేవైసీ కూడా చేయాల్సి ఉంటుంది.  దీనిని అప్డేట్ చేస్తేనే తదుపరి వాయిదా మొత్తం రైతుల ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కి సంబంధించి 15వ విడత డబ్బులు లబ్ధిదారులు పొందాలంటే ఈ కేవైసి తప్పనిసరిగా చేయించాలని కేంద్రం తెలిపింది.  ఇలా చేయకపోతే పథకం యొక్క లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తామని కూడా తెలిపింది. కాబట్టి లబ్ధి పొందాలి అంటే ఈ కేవైసీ చేయడం తప్పనిసరి.

మరింత సమాచారం తెలుసుకోండి: