ఈ మధ్యకాలంలో చాలామంది జీతం కోసం మాత్రమే జాబు చేస్తున్నారు.. అందుకే చాలామంది సైతం జాబు బోర్ కొట్టేసి పలు రకాల వ్యాపార సంస్థలలో అడుగుపెడుతూ ఉన్నారు. వేల జీతాన్ని వదిలేసి వ్యాపారాన్ని మొదలుపెట్టి లక్షలలో ఆదాయాన్ని పొందుతూ ఉన్నారు.. అలా దేశంలో మంచి డిమాండ్ ఉన్న వ్యాపారాలలో బొరుగులు (మరమరాలు) మంచి డిమాండ్ ఉంటుంది.. అయితే ఇందులో రెండు రకాలుగా ఉంటాయి. కొన్ని ఉప్పుగా ఉండగా మరికొన్ని ఉప్పు లేకుండా ఉంటాయి. ఈ రెండు బొరుగులు కూడా ఇండియాలో మంచి డిమాండ్ ఉందని చెప్పవచ్చు.



ఈ ప్రాజెక్టుని తయారు చేసుకోవడానికి కేవలం 3 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే చాలట.. అయితే ఇందుకు ముద్ర లోన్ యోజన కింద లోన్ తీసుకొని ఈ యూనిట్ని సైతం ప్రారంభించవచ్చు.. అయితే ఈ ప్రాజెక్టుని ప్రారంభించడానికి కచ్చితంగా లైసెన్స్ అవసరం ఆహార పదార్ధం కింద వస్తుంది కాబట్టి మనం FSSAI నుంచి ఫుడ్ లైసెన్స్ ని పొందగలిగాలి ఆ తర్వాతే ఈ వ్యాపారాన్ని సైతం మనం మొదలు పెట్టవచ్చు.. అయితే ఈ తయారీ కర్మాగారాన్ని ప్రారంభించడానికి మనకి వడ్లు లేదా బియ్యాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే వీటిని బట్టి బోరుగులని కూడా పిలుస్తారు.


ఈ మరమరాలను మనం ఎన్ని తయారు చేసుకుంటే అంతే విధంగా మనకి ఆదాయం లభిస్తుంది. ఈ మరమరాలను అధిక వేడి ద్వారా తయారు చేస్తూ ఉంటారు. అయితే పెద్ద తరహాలో ప్లానింగ్ ఉంటే కచ్చితంగా యంత్రాలను కొనుగోలు చేయడం మంచిది. బొరుగులు సైతం ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉన్నారు.. దాదాపుగా 25 సెర్ల బొరుగులు 350 రూపాయల వరకు పలుకుతున్నాయి. ఇక చిరు వ్యాపారస్తులు కూడా బండిమీద పెట్టుకొని పలు రకాలుగా అమ్ముకుంటూ ఉంటారు. ఖచ్చితంగా వీటి వినియోగం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. మనం టిఫిన్ కి, స్నాక్స్ కి, బొరుగులు ఉంటలకి తదితరు వాటిని ఎక్కువగా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు దీనివల్ల అధిక లాభంగాన్ని పొందుతూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: