ఈ మధ్యకాలంలో చాలామంది బిజినెస్ రంగం వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. అయితే సరైన బిజినెస్ను ఎంపిక చేసుకోకుంటే లాభాలను సైతం పొందలేరు. ప్రస్తుతం ఉన్న రోజులలో ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకున్న వాటిలో పానీపూరి బిజినెస్ మంచి లాభాలలో దూసుకుపోతోంది... పట్టణాలు పల్లెలు అని తేడా లేకుండా సాయంత్రం అయితే చాలు చాలామంది ఎక్కువగా పని పూరి బండి చుట్టూనే ఉంటున్నారు.. ఉద్యోగుల కంటే వీరే ఎక్కువగా సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.


అయితే కేవలం పానీపూరి ఎలా చేయాలో తెలిస్తే ఈ బిజినెస్ ని సైతం మనం మొదలు పెట్టవచ్చు.  పానీ పూరి బండి కాకుండా అందులో వాడే పూరీలను అమ్మి నెల నెల కొంత మొత్తంలో డబ్బును సైతం సంపాదించవచ్చు.. పానీ పూరి అమ్మడం ఇష్టం లేకపోతే వాటికి సంబంధించిన పూరీలను సైతం వ్యాపారంగా చేసుకోవచ్చు.. పానీ పూరి ని మైదా పిండితో తయారు చేయడం జరుగుతుంది. అయితే ఇలా పిండిని కలిపి పెట్టుకున్న తర్వాత పానీ పూరి యంత్రం లోకి వేస్తే వీటి ద్వారా పూరీలు బయటకి వస్తాయట.. అయితే పని చాలా తక్కువగానే ఉంటుందట.


ఇటీవలే పుత్తూరులో మనోజ్ అనే వ్యక్తి పానీ పూరి బిజినెస్ ని మొదలుపెట్టి దాదాపుగా నెలకు 5 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నట్లు తెలియజేస్తున్నారు. అయితే గతంలో ఎన్నో బిజినెస్లు, ఉద్యోగాలు  చేసి ఇబ్బందులు పడ్డారని కానీ ఏ ఒక్కటి కూడా సరైన ఆదాయాన్ని కూడా ఇవ్వలేకపోవడంతో ఈ పానీ పూరి తయారు చేసే వాటికి మంచి డిమాండ్ ఉందని తెలుసుకొని వీటిని అమ్ముతున్నారట. ప్రతిరోజు 5 కిలోల పానీపూరీలను మాన్యువల్ గా తయారుచేసి అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత లాభాలు బాగా రావడంతో టెక్నాలజీతో పనిచేసే ఒక మిషన్ ని కొనుక్కున్నాడట. దీని ధర రూ .2 లక్షల రూపాయలు అయితే సోలార్ తో నడిచే మిషన్ కాబట్టి 70 వేల వరకు సబ్సిడీ ఉంటుందట. తన ఇంటి ఆవరణంలోని ఈ చిన్న పూరి తయారు చేసే యూనిట్ని ఏర్పాటు చేసుకున్నారట. కనీసం ప్రతిరోజు 40 కిలోల పానీపూరీలను తయారు చేస్తున్నాడట. తన చుట్టూ కూడా జనాలను పనిలోకి పెట్టుకొని ఆదర్శంగా నిలవడం జరిగిందట. మనం చేసుకునే కొద్దీ ఆదాయం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: