ప్రస్తుతం ఉన్న రోజులలో చాలామంది మహిళలు కూడా పలు రకాల వ్యాపార రంగాలలో రాణిస్తూ కొన్ని కోట్ల రూపాయలను సంపాదిస్తూ ఉన్నారు. మహిళలు కూడా కొత్తగా ఏదైనా వ్యాపారాలను సైతం ప్రారంభించే విధంగా అడుగులు వేస్తూ పురుషులకు దీటుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే ఎవరైనా మహిళలు అదిరిపోయే బిజినెస్ను మొదలు పెట్టాలనుకునే వారికి ఒక ఐడియా ఉన్నది.. ఈ బిజినెస్ ని మొదలుపెట్టడం వల్ల ప్రతిరోజు 2000 నుంచి 3000 వరకు సంపాదించుకొనే అవకాశం ఉంటుందట. ఈ బిజినెస్ ఐడియా ను ఇంట్లో కూడా మొదలు పెట్టవచ్చు.


ఆ బిజినెస్ ఐడియా నే మెహందీ.. ఎటువంటి ఫంక్షన్ కి అయినా సరే కచ్చితంగా ఆడవాళ్లు ఎక్కువగా మెహంది ని ఉపయోగిస్తూ ఉంటారు.. పెళ్లిళ్ల సీజన్ వస్తే చాలు కచ్చితంగా వీటికి మంచి డిమాండ్ ఉంటుంది. అందుకే ఏడాది పొడవున మార్కెట్లో మెహంది వాటికి మంచి డిమాండ్ ఉంటుందని చెప్పవచ్చు. మెహందీ కోన్స్ కి ఎక్కువ డిమాండ్ ఉండడం వల్ల వీటిని పలు రకాల వ్యాపారస్తులు క్యాష్ చేసుకుంటున్నారు..మెహందీకి ప్రత్యేకమైన బ్రాండ్ ఏమీ కూడా అవసరం లేదు.. సొంతంగా మెహందీ కోన్స్ ని తయారు చేసి చాలా మొత్తంలో సంపాదించుకోవచ్చు.


పెట్టుబడి కూడా వీటికి పెద్దగా అవసరం లేదు..కేవలం కావలసిందల్లా గోరింటాకు మాత్రమే అలాగే చక్కెర మూలికలు, ప్యాకింగ్ కి కావలసిన సామాన్లతో వీటిని తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా మేకింగ్ మిషన్ మెహందీ పౌచ్ వంటివి తీసుకోవాలి ఇలా వీటన్నిటినీ కొనుగోలు చేసిన వెంటనే ఈ బిజినెస్ సైతం మనం మొదలు పెట్టుకోవచ్చు. ఈ బిజినెస్ కోసం మనం గోరింటాకు మొక్కలను కూడా ఎక్కడైనా పెంచుకోవచ్చు.. ఈ మెహందీ తయారు చేసుకోవడానికి పలు రకాల కోర్సులు కూడా ఉంటాయి. అలా నేర్చుకున్న తర్వాత బిజినెస్ ను మొదలుపెట్టి డైరెక్ట్ గా మనమే మార్కెట్లోకి విడుదల చేసుకుంటే రోజుకి రెండు వేల పైన ఆదాయాన్ని పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: