అయితే 55 ఏళ్ల లోపు ఉన్న మహిళలకు సైతం ప్రతినెల 2500 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించే పథకాన్ని అమలుపరిచేలా కాంగ్రెస్ ప్రభుత్వం పలు రకాల ప్రణాళికను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.. ఎన్నికలు ముందు సైతం కాంగ్రెస్ పార్టీ ఈ హామీని సైతం ఇవ్వడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి విధివిధానాల రూపకల్పనకు సైతం ప్రభుత్వ పలు రకాల చర్యలు చేపడుతోంది. లబ్ధిదారులను ఈ పథకానికి ఎంపిక చేయాలి అంటే తెల్ల రేషన్ కార్డు ముఖ్యమని ప్రభుత్వం భావిస్తోంది.. అలాగే ఇంతవరకు ప్రభుత్వ పింఛన్ కూడ పొందని మహిళలకె ఈ పథకం వర్తింప చేయాలన్నట్లుగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పింఛన్ వంటివి పొందని కుటుంబాలలోని మహిళలకు మాత్రమే రూ.2500 ఆర్థిక సహాయాన్ని సైతం అందించే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని మహిళలకు సీఎం త్వరలోనే తీపి కబురు చేయబోతున్నట్లుగా తెలంగాణ రెవెన్యూ మంత్రి శాఖ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిన్నటి రోజున అధికారికంగా ప్రకటించడం జరిగింది. ముఖ్యమంత్రి ఈ పథకం గురించి చెబుతారని ఎవరు కూడా ఎలాంటి ఊహాగానాలను సైతం నమ్మవద్దండి అంటూ తెలియజేశారు. దీంతో తెలంగాణ మహిళలు సైతం ఈ పథకం కోసం చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ పథకం పైన సీఎం ఎప్పుడు స్పందిస్తారో చూడాలి..