ప్రతి ఏడాది కూడా పలు రకాల వాటిలో నిబంధనలు అమలు అవుతూ ఉంటాయి.. అయితే ఈసారి ఆదాయపన్ను వాటిలో మార్పులు చేయడం జరిగింది.2023-2024 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఒక కీలకమైన ప్రకటన చేశారు .దీని ద్వారా కొత్త పన్ను విధానాన్ని సైతం ప్రకటించడం జరిగింది.ఇవే కాకుండా ఆదాయపన్ను శాఖలో కూడా అనేక మార్పులు చేసింది..2024 లోనుంచి సామాన్య ప్రజల పైన విటి ప్రభావం చూపబోతున్నట్లు తెలుస్తోంది.ఇప్పుడు వాటి గురించి పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం.


2020 బడ్జెట్లో మొదటిసారి కొత్త పన్ను విధానాన్ని ప్రకటించారు..మార్చి 2003లో డిఫాల్ట్ పన్ను విధానాన్ని రూపొందించడం జరిగింది.. ఎవరైనా పన్ను చెల్లింపుదారుడు తానంతట తాను ఏదైనా ఒక పన్ను విధానాన్ని ఎంచుకోకపోతే అటువంటి పరిస్థితులలో TDS కట్ అవుతుందని ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు.. అయితే ఈ ఏడాది కొత్త పన్ను విధానంలో పలు రకాల మార్పులు చేశారు..2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు పెరిగింది.. పన్ను మినహాయింపు పరిమితి 5 లక్షల నుంచి 7 లక్షల వరకు పెరిగింది.

ఈ సంవత్సరంలో 5 కోట్ల కంటే ఎక్కువగా సంపాదిస్తున్న ప్రజలు సర్ చార్జ్ రేటులో సరికొత్త కోతను పెట్టారు 37% నుంచి 25 శాతానికి తగ్గించారు.

జీవిత బీమా పాలసీ మెచ్యూరిటీ మొత్తం పైన పన్ను నిబంధనలను కేంద్ర ప్రభుత్వం మార్చడం జరిగింది.. గతంలో ఈ మొత్తం పూర్తిగా పన్ను రహితంగా ఉండేది. కానీ ఇప్పుడు పన్ను చెల్లింపు దారులు 5 లక్షల కంటే ఎక్కువ దాటితే పన్ను చెల్లించాల్సి ఉంటుందట..


కేంద్ర ప్రభుత్వం ఆస్తుల నుంచి అమ్మడం ద్వారా వచ్చే ఆదాయం పైన మినహాయింపు పరిమితిని 10 కోట్లుగా నిర్ణయించడం జరిగింది. ఆ పరిస్థితులలో పన్ను చెల్లింపు దారులు ఆదాయ పన్ను సెక్షన్ 54,54F కింద రెసిడెన్షియల్ ప్రాపర్టీ నుండి ఏదైనా ఆదాయం వస్తే 10 కోట్ల రూపాయల వరకు క్లైమ్ చేసుకోవచ్చు.

ఈ ఏడాది ఆన్లైన్ గేమింగ్ ద్వారా వచ్చే ఆదాయాల పైన 30% వరకు పనులు విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా ఐటీ రిటర్న్స్, డేట్ ఫండ్స్ ఇన్వెస్టర్ల కోసం సరికొత్త రూల్స్ ని తీసుకువచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: