
ప్రస్తుతం క్వింటా సన్నబియ్యం 6500 రూపాయల వరకు చేరింది.. అయితే బ్రోకర్లు రైస్ మిల్లుల వద్ద నుంచి కొన్న వారికి అదనంగా 5 నుంచి 8 రూపాయలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మార్కెట్లో 25 కిలోల పాత బియ్యం 1500 ఉండగా గత ఏడాది క్వింటా ₹3000 ఉండగా ఇప్పుడు 3500 కు చేరింది.. అదే పాత బియ్యం అయితే 4200 ఉండగా ఇప్పుడు 6,500 కు చేరింది.. గత కొద్ది నెలలుగా నిత్యవసర ధరలు అమాంతం పెరుగుతూనే ఉన్నాయి.
చాలామంది సైతం ఎక్కువగా రైతుల వద్దని కొనడానికి మక్కువ చూపుతున్నారు. రైస్ మిల్లులు మార్కెట్లో కంటే రైతులు 6000 రూపాయలకే ఇస్తూ ఉన్నారు.. ఏడాది వరి పండించిన రైతులకు భారీగానే గిట్టుబాటు అయ్యేలా కనిపిస్తోంది అయితే పెట్టుబడులు కారణం చేత ఇంతటి ధరలు కూడా పెరుగుతున్నాయని పలువురు వ్యవసాయ నిపుణులు తెలియజేస్తున్నారు. రాబోయే రోజుల్లో బియ్యం ధరలు మరింత పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నదట.. ప్రస్తుతం చాలామంది తడి పంటలు వేస్తూ ఉండడమే కాకుండా అరటి, సీనా, డ్రాగన్ ఫ్రూట్ ఇతరత్రా పంటలను వేస్తూ ఉన్నారు తప్ప వరి పంటలు వేయడం చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.