ఎలాగోలాగా డబ్బు సంపాదించాలనుకునేవారు ఏదైనా ఉద్యోగం చేసి వాటి మీద ఆధారపడుతూ ఉంటారు.. అయితే కచ్చితంగా ఏదో ఒక సమయంలో అదనపు ఖర్చు ఏర్పడుతుంది..మీ ఖర్చులు అవసరాలు ఇష్టాలు పొదుపులకు గా మిగిలింది ఏమీ ఉండదు.. అందుకే చాలామంది ఇతర చిన్న చిన్న బిజినెస్ లను కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు.. కొంతమంది ఆన్లైన్ బిజినెస్ లు చేస్తూ ఉండగా మరి కొంతమంది రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తు ఉంటారు. ఇలా ఏదో ఒక విధంగా సైడ్ బిజినెస్ ను అయితే చేస్తూ ఉంటూ ఆదాయాన్ని సంపాదిస్తుంటారు.


ఈ క్రమంలోని ఇప్పుడు లాభదాయకమైన మార్గాన్ని ఎంచుకోవాలనుకునే వారికి అదిరిపోయి బిజినెస్ ఉన్నది ఇది వ్యవసాయదారిత వ్యాపారం అని చెప్పవచ్చు.. అదేమిటంటే గంధపు చెక్కల ఉత్పత్తి ఇది సమాజంలో చాలా విలువైన కలపగా పేరుపొందింది. గంధపు చెక్కల సువాసన ప్రసిద్ధికి పెట్టింది పేరు.. అయితే ఈ పరిశ్రమలో విజయం సాధించడానికి కొంత సహనం మాత్రమే అవసరము ఈ నేపథ్యంలోనే ఈ గంధపు చెక్కల ప్లాంటేన్ బిజినెస్ గురించి ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.


 గంధపు చెట్లను పెంచడానికి సరైన నేల వాతావరణ పరిస్థితులను ఉండేచోట ఉంచాలి. అధిక నాణ్యత గల విత్తనాలు మొక్కలను ఎంపిక చేసుకోవడం వల్ల మంచి లాభాలను పొందవచ్చు. ముఖ్యంగా నీటిపారుదల కచ్చితంగా ఉండాలి. గంధపు చెక్కలు విలువైన చక్కగా మారడానికి కొన్ని సంవత్సరాలు పాటు సమయం పడుతుంది. ఈ గంధపు చెక్కలు పూర్తిగా తయారైన చెక్క నుంచి గంధపు నూనెను కూడా వెలికి తీస్తారు. ఈ మొక్కలను కాపాడుకునేందుకు ఖచ్చితంగా 10 సంవత్సరాలు పైనే సమయం పడుతుంది.


చెట్టు నాటిన 8 ఏళ్ల నుంచి ఈ చెట్ల నుంచి సువాసన వెదజల్లుతుంది. దీనివల్ల చాలామంది బెదిరింపులు కూడా చేస్తూ ఉంటారు. అలాగే జంతువులనుంచి కూడా ఈ మొక్కలను కాపాడుకోవాలి. ఇలా కాపాడుకున్నట్లు అయితే ఒక చెట్టు నుంచి దాదాపుగా 3 నుంచి 5 లక్షల వరకు ఏడాదికి సంపాదించుకోవచ్చు. అలా ఏడాదికి రూ .10 చెట్లు చొప్పున ఉంటే సంవత్సరానికి రూ .30 లక్షలకు పైగా ఆదాయం వస్తుంది.. అయితే చెట్లు ఉండే సంఖ్యను బట్టి డబ్బులు వ్యత్యాసం ఉంటుంది. అయితే ఈ మొక్కలను ప్రభుత్వ అనుమతి నుంచి తీసుకున్న తర్వాతే నాటుకోవాలి. అయితే అమ్మినప్పుడు ఆ అమ్మకం ద్వారా ప్రభుత్వానికి కొంత టాక్స్ ని కట్టాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: