సామాన్యులకు సైతం కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకువచ్చింది.. ముఖ్యంగా వంట గ్యాస్ సిలిండర్లు ధరనీ మరొకసారి తగ్గించి ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తోంది.. రూ.100 రూపాయల వరకు తగ్గించినట్లు ప్రధాన మోడీన స్వయంగా తన ట్విట్టర్ లో మహిళా దినోత్సవం సందర్భంగా ఎల్పిజి సిలిండర్ ని 100 రూపాయలు తగ్గిస్తున్నట్లు తెలియజేశారు. గత ఏడాది రాఖీ సందర్భంగా ఆగస్టు 29న మహిళలకు గిఫ్ట్ గ్యాస్ సిలిండర్ ధరనీ రూ.200 రూపాయల చొప్పున మోడీ ప్రభుత్వం తగ్గించినది..


ప్రస్తుతం 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.955 రూపాయల ఉండగా ఇప్పుడు తాజా నిర్ణయంతో 855కే చేరింది.. అయితే వివిధ ప్రాంతాలను బట్టి గ్యాస్ ధరలలో మార్పులు ఉన్నాయి.. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1795 రూపాయలు ఉండగా.. వీటి ధరలలో వ్యత్యాసం పెరుగుతూనే ఉంది. ఇంట్లో వాడేటువంటి వంట గ్యాస్ ను మరింత సరసమైనదిగా చేయడానికి తమ శ్రేయస్సు మద్దతు ఇవ్వడానికే లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రధాన మోడీ తెలియజేశారు..


నిన్నటి రోజున కేంద్ర క్యాబినెట్లో ఉజ్వల స్కీం లబ్ధిదారులకు మరొక శుభవార్తను వెల్లడించారు..  గ్యాస్ సిలిండర్ల పైన ఇస్తున్న రాయితీని మరో ఏడాదిపాటు పొడిగించారు.. ఈ నేపథ్యంలోనే 10 కోట్ల కుటుంబాలకు సైతం ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఉజ్వల పథకం ద్వారా ఒక గ్యాస్ సిలిండర్ పైన రూ.300 రూపాయల సిలిండర్లను సబ్సిడీ అందిస్తోంది. అంటే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ఇప్పటివరకు 655 కుండగా నిన్నటి రోజున మరో అదనంగా ₹100 తగ్గించగా.. మొత్తం మీద 555 రూపాయలకే గ్యాస్ రానుంది.. 2016లో కేంద్రం ఉజ్వల పథకాన్ని ప్రారంభించింది వెనుకబడిన వర్గాల వారికి దారిద్యరేఖకు దిగువన ఉన్న వారికి మాత్రమే ఈ పథకాన్ని వర్తించేలా తీసుకువచ్చారు దీని కింద గ్యాస్ కనెక్షన్ కూడా ఫ్రీగానే అందిస్తున్నారు. అయితే అకౌంట్ లోకి డబ్బులు సబ్సిడీ రూపంలో పడుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: