మన దేశంలో నగరాలు పట్టణాలలో కంటే ఎక్కువగా పల్లెల్లోని ప్రజలే చాలా ఆనందమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి వీరు తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అయితే గిట్టుబాటు ధరలు లేక కొన్నిచోట్ల అన్నదాతల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళిగా అక్కడే గా మారిపోయింది. ముఖ్యంగా పెట్టుబడి ఖర్చులు మందుమూటలు ,విత్తనాలు, లేబర్స్ అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయాయి. అయితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని ఆర్జించే ఒక పంట ఉన్నదట. మరి ఆ పంట గురించి పూర్తిగా చూద్దాం.


కేవలం 20,000 పెట్టుబడి పెడితే చాలు సులువుగా ఏడాదికి మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు ఆదాయాన్ని పొందవచ్చు. ఈ పంట సాగు చేయడానికి భూమి ఉంటే చాలు ఎలాంటి ఎరువులు కూడా అవసరం లేకుండా ఎక్కడైనా పండుతుందట. ఇటీవలే ప్రధాన నరేంద్ర మోడీ కూడా మనకీ బాత్ ద్వారా రైతులకు పలు రకాల సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా నిమ్మగడ్డి సాగు చాలామంది రైతులను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ నిమ్మ గడ్డి సాగు చేశాక మార్కెట్ లో మంచి డిమాండ్ పెరిగిందని తెలియజేశారు.

నిమ్మగడ్డి సాగు చేయడానికి మొదటి 20 వేల రూపాయలు పెట్టుబడి ఉంటే చాలని.. దీనిని ఫిబ్రవరి, జూలై మధ్య ఈ పంట నాటుకునేందుకు సరైన సమయమని తెలుస్తోంది. ఒక్కసారి ఈ పంటను వేస్తే సుమారుగా ఐదేళ్లపాటు దిగుబడి వస్తూ ఉంటుందట. ఏడాదికి ఐదు నుంచి ఆరుసార్లు కోత కోసుకోవచ్చట. ఈ పంటను కరువు ప్రాంతాలలో కూడా సాగు చేసుకోవచ్చు. అలా ఒక హెక్టార్ కి నిమ్మగడ్డి పంట వేసుకున్నట్లయితే నాలుగు లక్షల రూపాయల వరకు అందుకోవచ్చు. ముఖ్యంగా నిమ్మగడ్డి తో తయారు చేసేటువంటి నూనె కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో.. ఈ నిమ్మగడ్డి నూనె సబ్బులు, పలు రకాల ఔషధ గుణాలు తయారు చేయడానికి ఉపయోగిస్తారట.. ఈ నిమ్మగడ్డి నూనె ధర ఒక లీటరు 1500 రూపాయల వరకు ఉంటుందట. అలా ఏడాదికి హెక్టార్ కి 250-300 కు పైగా లీటర్ల నూనెను తీసుకోవచ్చట.

మరింత సమాచారం తెలుసుకోండి: