తెలుగు ఇండస్ట్రీలో మెగస్టార్ చిరంజీవి పునాధిరాళ్లు చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు.. మొదట విలన్ వేషాలు వేస్తూ.. తర్వాత హీరోగా ఎదిగారు. ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండ స్వయంకృషితో తనకంటూ ఓ ఇమేజ్ ఏర్పాటు చేసుకొని పైకి వచ్చారు. ఇక అప్పట్లో చిరంజీవి అంటే డ్యాన్స్, ఫైట్స్ బాగా ఉండేవి మాస్ ప్రేక్షకులు బాగా ఇష్టపడే వారు అదే ఆయనను మెగాస్టార్ స్థాయికి తీసుకు వచ్చింది. ఇక సినిమా ఇండస్ట్రీలోకి చిరంజీవి వారసులు వస్తున్నారు.
ఇప్పటికే పవన్ కళ్యాన్, రాంచరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ రీసెంట్ గా నాగబాబు కూతురు నిహారిక కొణిదెల కూడా సినీమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. తాజాగా మరో వారసుడు కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్. సినిమా ఫ్యామిలీలో పుట్టడంతో అతనిలోనూ నటుడు కావాలనే ఆకాంక్ష ఎప్పుడో మొదలైంది.
మెగా హీరోలు
గతంలో చిరంజీవి నటించిన ‘శంకర్ దాదా జిందాబాద్' సినిమాలో పేషెంటుగా కూడా నటించాడు. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ తన చదువుకు కొనసాగిస్తూ నటన, డాన్స్, ఫైట్స్ ఇలా వివిధ కేటగిరీల్లో శిక్షణ పొందుతున్నట్లు సమాచారం. పలువురు దర్శకులు ఇప్పటికే వైష్ణవ్ తేజ్ ను కలిసారని, కథలు వినిపించారని సమాచారం. అయితే పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకున్న తర్వాతే సినిమా రంగంలోకి వస్తానని అంటున్నాడట వైష్ణవ్ తేజ్.