పాప్ మ్యూజిక్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకొని సంగీత ప్రియులను ఉర్రూతలూగించిన ప్రముఖ హాలీవుడ్ పాప్ గాయని, గ్రామీ అవార్డు గ్రహీత నటాలీ కోలే కన్నుమూశారు. ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో బాదపడుతున్నారు.
లాస్ ఏంజెల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే నూతన సంవత్సరం సందర్బంగా ఆమె లాస్ ఏంజెల్స్ లోని డిస్నీహాల్ లో పెద్ద ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది..కానీ అనుకోకుండా అనారోగ్యం పాలు కావడం చికిత్స పొందుతూ చనిపోవడంతో ఆ ప్రదర్శన రద్దయ్యింది.
సింగర్ నటాలీ కోలే
నటాలీ కేవలం సింగర్ గానే కాకుండా మంచి పాటల రచయిత. ఆమె పాడిన ఆన్ ఫర్ గెటబుల్ అనే అల్బమ్ ఆమెకు మంచి గుర్తింపునివ్వడమే కాక.. ఎన్నో ఆవార్డులను తెచ్చిపెట్టింది. ఈ అల్బమ్ కే ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డును కూడా నటాలీ సొంతం చేసుకున్నారు.. నటాలీ మృతి పట్ల పలువురు హాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.