రాజమౌళి ఇంట్రడక్షన్ అవసరం లేని.. ఎంత చెప్పినా సరిపోని ఓ దర్శక దిగ్గజం.. అయితే ఈ మాట అనడానికి కాని అనిపించుకోడానికి కాని కొన్ని అర్హలు ఉండాలి. అయితే ఎన్ని ఉన్నా తనను తాను తక్కువ చేసుకోవడమే రాజమౌళిలో ఉన్న గొప్పతనం. అయితే ఎక్కడైనా ఎప్పుడైనా తన మీద నెగటివ్ ప్రచారం జరుగుతుంది అంటే ఈరోజే జాగ్రత్త పడే రాజమౌళికి ఓ పెద్ద చిక్కు ముడి వచ్చి పడ్డది.


అదే తన దర్శకుల సక్సెస్.. రాజమౌళి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన వారి చిన్నగా వేరు కుంపటి పెట్టుకుని దర్శకులుగా మారడం జరిగింది. అయితే పేరుకి దర్శక ధీరుడు దగ్గర అసిస్టెంట్ అంటే సినిమాను ఆడియెన్స్ లోకి ఎలా తీసుకెళ్లాలో బాగా తెలిసిన వ్యక్తులు.. రాజమౌళితో ప్రయాణం చేసిన వారు. అయితే రాజమౌళి శిష్యులం అంటూ చెప్పుకొచ్చి దర్శకులు చేసిన ఏ సినిమా ఇంతవరకు సక్సెస్ సాధించలేదు.


ఇంతకుముందు ఇద్దరు ముగ్గురు దర్శకులు ఇలానే రాజమౌళి పరువు తీయడం జరిగింది. ఇప్పుడు లేటెస్ట్ గా జక్కన్న మరో శిష్యుడు జగదీశ్ తలశిల ఆ ప్రయోగం చేస్తున్నాడు. తన దర్శకత్వంలో లచ్చిందేవికి ఓ లెక్కుంది సినిమా తీశాడు. రేపు రిలీజ్ అవుతున్న ఈ సినిమా హిట్ కొట్టి రాజమౌళినే కాదు అతని శిష్యులు కూడా హిట్ కొడతారు అని చాటి చెప్పాలని కోరుకుంటున్నాడు. అందుకే సినిమా ఆడియో రిలీజ్ కు వెళ్లి మరి సపోర్ట్ చేశాడు.


అయితే ఎన్నడు తన సినిమా కోసం కూడా ఇంతలా వెయిట్ చేయని రాజమౌళి లచ్చిందేవి సినిమా ఎలా ఉంటుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడట. ప్రేక్షకులు తన శిష్యుడిని యాక్సెప్ట్ చేస్తాడా లేదా అని చూస్తున్నాడు. మరి రాజమౌళి ఎంత గొప్ప దర్శకుడు అయినా ఈ అపవాదం నుండి బయటపడే మార్గం ఎలా అని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: