మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ కథ వ్యవహారం నోటీసుల స్థాయి దాటి చివరకు కోర్టు మెట్లు ఎక్కినట్లుగా వార్తలు వస్తున్నాయి. తాను వ్రాసిన ‘చచ్చేంత ప్రేమ’ నవలను దర్శకుడు కొరటాల శివ కాపీ కొట్టాడని గతంలోనే వార్తలకెక్కాడు ఆ కథను వ్రాసిన శరత్ చంద్ర. అయితే ఈ విషయమై కొరటాల శివ సరిగ్గా స్పందించక పోవడమే కాకుండా పరిహారంగా కావాలి అనుకుంటే 10 లక్షల రూపాయలు పరిహారంగా ఇస్తామని కొరటాల రాయబారాలు నడిపినట్లు ఫిలింనగర్ టాక్.

ఈ రాజీ మార్గానికి శరత్ చంద్ర ఒప్పుకోకుండా కోర్టు మెట్లు ఎక్కడంతో హైదరాబాద్ కు చెందిన సిటీ సివిల్ కోర్టు శరత్ చంద్ర వేసిన దావాను విచారణకు స్వీకరించడమే కాకుండా ఈ సినిమాకు దర్శకత్వం వహించిన కొరటాల శివకు నిర్మించిన మైత్రి మూవీస్ నిర్మాతలకు నోటీసులు పంపిచ్చినట్లు టాక్. 

అదేవిధంగా ఈసినిమాను బాలీవుడ్ లో హృతిక్ రోషన్ ను హీరోగా పెట్టి రీమేక్ చేస్తున్న నేపధ్యంలో ఆ ప్రయత్నాలు ఆపాలని శరత్ చంద్ర కోరడంతో హృతిక్ రోషన్ కు కూడ కోర్టు నోటీసులు పంపినట్లు టాక్. వెలుగొండ ప్రాజెక్ట్ నేపధ్యంలో రచయిత శరత్ చంద్ర వ్రాసిన ఈ కథ ఒక ప్రముఖ వార పత్రికలో ప్రచురింపబడింది.

అయితే ఇంత రగడ జరుగుతున్నా కొరటాల శివ ఈ విషయమై ఇప్పటికీ ఏ మాత్రం స్పందించకుండా తన ‘జనతా గ్యారేజ్’ వ్యవహారంలో బిజీగా ఉండటం బట్టి కొరటాలకు ఈ విషయాలు పట్టవా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: