తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు రేలంగి,రాజబాబు,పద్మనాభం,చలం,అల్లు రామలింగయ్య,రమణారెడ్డి లాంటి గొప్ప హాస్యనటులు తెలుగు ప్రేక్షకుల మనసుకు హత్తుకు పోయారు. తర్వాత అంతటి హాస్యన్ని పండించిన వారు సుత్తివీర భద్రారావు, సుత్తివేలు,నూతన్ ప్రసాద్ లాంటి వాళ్లు హాస్యాన్ని పండించారు. ఇక సినిమా ఎలా ఉన్న అందులో ముఖ్యపాత్ర పోషించేది హాస్యం మాత్రమే. ఒక్కోసారి పూర్తి హాస్య భరిత చిత్రాలో ఎంతో ఘన విజయాన్ని సాధించిన రోజులు కూడా ఉన్నాయి. మొదట్లో సహనటుడిగా ఎంట్రీ ఇచ్చి తర్వాత హాస్య నటుడిగా పేరు సంపాదించిన రాజేంద్ర ప్రసాద్ కామెడీ హీరోగా అద్భుతమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.

హాస్య బ్రహ్మా జంద్యాల , రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు హాస్య చిత్రాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాలే.. ఇక ‘ఆహనా పెళ్లంట’ చిత్రంతో ప్రస్తుతం ఇండస్ట్రీనీ రాణిస్తున్న కామెడీ కింగ్ బ్రహ్మానందం మొదటి చిత్రం.  ఈ చిత్రం ఎంతో మందికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. హీరో అంటే పైట్లు, పాటలు అనే మార్కును తొలగించి... హాస్యాన్నే ప్రధానంశంగా తీసుకుని సినిమాలు చేసి, విజయం సాధించిన నటుడు రాజేంద్రప్రసాద్. కేవలం హాస్యాన్నే గాక.. నవరసాల్ని పండించి, కథానాయకుడిగా ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. నటుడిగా వివిధ భాషలలో రెండు వందల పైచిలుకు చిత్రాల్లో నటించాడీ ఆంధ్రా చార్లీచాప్లిన్.

అప్పుచేసి పప్పుకూడు


కారెక్టర్ నటులు మాత్రమే కామెడీని పండిస్తున్న రోజుల్లో... హీరో కూడా నవ్వుల్ని వండివార్చగలడు అని నిరూపించాడు రాజేంద్రప్రసాద్. జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఈవీవీ సత్యనారాయణ, బాపు లాంటి వారి దర్శకత్వంలో అద్భుతాలు నమోదు చేసిన ఘనత రాజేంద్ర ప్రసాద్ కే దక్కుతుంది.  కేవలం నవ్వించడమే కాదు ఏడిపించడంలోనూ మన నటరాజు సిద్ధహస్తుడే. తెలుగు ఇండస్ట్రీలో రాజేంద్ర ప్రసాద్ ని అందరూ ముద్దుగా నటకీరీటీ అంటారు..అంతే కాదండోయ్ నటకిరీటి కీర్తి క్విక్ గన్ మురుగన్ సినిమాతో హాలీవుడ్ దాకా పాకింది. రెండు నంది అవార్డుల సహా ఒక ఫిలింఫేర్ పురస్కారం రాజేంద్రప్రసాద్ ఖాతాలో ఉంది. ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు..తండ్రి, మామ  పాత్రల్లో కూడా నటిస్తున్నారు.

అహనా పెళ్ళంట చిత్రం పోస్టర్


విభిన్నమైన పాత్రలలో ఆయా భావోద్వేగాలను బేషుగ్గా పండించిన నటుడు రాజేంద్రప్రసాద్. పాత్ర నచ్చాలే కానీ చిన్నా పెద్దా తేడాలేకుండా సినిమాలు చేస్తూ వచ్చిన మన నటకిరీటి తాజాగా నెగిటివ్ టచ్ ఉన్న పాత్రల్లోనూ అలరించడానికి సిద్ధమయ్యారట. ప్రముఖ దర్శకుడు ఆ తరహా పాత్ర కోసం రాజేంద్ర ప్రసాద్‌ని సంప్రదించగా దానికి ఆయన అంగీకారం తెలిపినట్టు సమాచారం. నేటితరంలో హీరోలతోపాటు ఆయన ప్రధాన పాత్రలతో రూపొందుతున్న సినిమాలతో బిజీగా ఉన్న రాజేంద్ర ప్రసాద్ నెగిటివ్ రోల్ ఎలా పండిస్తారో వేచి చూడాల్సిందే..అయితే గత సంవత్సరం ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రంలో కాస్త నెగిటీవ్ టచ్ ఉన్న పాత్ర పోషించి మెప్పించిన విషయం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: