భల్లాల దేవుడుగా అతి క్రూరంగా కనిపిస్తూ తన కళ్ళల్లో పగను చూపెట్టిన రానాకు అతడి చిన్న తనంలో కుడి కన్ను కనిపించేది కాదు అంటే ఎవరు నమ్మరు.  అయితే ఈ విషయాన్ని స్వయంగా రానా బయట పెట్టడం సంచలనంగా మారింది. మంచు లక్ష్మి నిర్వహిస్తున్న ‘మేము సైతం’ కార్యక్రమం తొలి ఎపిసోడ్ లో అతిధిగా పాల్గొన్న రానా తన చిన్న నాటి సీక్రెట్ బయట పెట్టాడు. ఈ కార్యక్రమంలో రానా చెప్పిన మాటలు చాలా స్పూర్తి దాయకంగా నిలిచాయి. 

మరణించే ముందు తన తాత రామానాయుడు ఒక మాట చెప్పారని ‘కష్టాన్ని భరించగలిగే వారికే దేవుడు సమస్యలు ఇస్తాడని, అందుకే సమస్యలు ధైర్యవంతులకే వస్తాయని’ అంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కుటుంబానికి ధైర్యం చెప్పాడు రానా. ఇదే కార్యక్రమంలో కూలీగా పని చేస్తూ చనిపోయిన ఒక వ్యక్తి కుటుంబాన్ని ఆదుకునేందుకు తన వంతు సాయం చేసిన రానా ఆ భాదిత కుటుంబంలో లోని మృతుడి భార్యకు బ్రెయిన్ ట్యూమర్ కారణంగా చూపులేదు అన్న విషయం తెలుసుకుని బాధ పడిన రానా తన చిన్ననాటి ఫ్లాష్ బ్యాక్ విషయాలను బయట పెట్టాడు. 

“తనకు చిన్నప్పుడు కుడి కన్ను కనిపించేది కాదని, అయితే ఎవరో ఒక వ్యక్తి మరణించిన తరువాత దానం చేసిన కంటిని తనకు అమర్చారని, అప్పటి నుంచి తాను ప్రపంచాన్ని పూర్తిగా చూడగలుగుతున్నానని” అంటూ రానా చెప్పిన నిజంతో ఆ ప్రోగ్రామ్  చూస్తున్న వాళ్ళు షాక్ అయ్యారు. ఈ కార్యక్రం లో పాల్గొన్న భాధితులకు సహాయం చేయడానికి రానా కొద్ది రోజుల క్రితం కూలీగా మారి రైతు బజారులో మూటలు మోసిన విషయం తెలిసిందే.  

గత సంవత్సరం చెన్నై నగరాన్ని వరదలు ముంచెత్తినప్పుడు అనేక మంది యంగ్ హీరోలను కలుపుకుని సేవాకార్యక్రమాలు రానా చేసిన  విషయం తెలిసిందే. పబ్బుల్లో హడావిడి చేస్తూ హీరోయిన్స్ తో డేటింగ్  వార్తలలో  ఉండే రానా ఇలా సామజిక సేవా కార్య క్రమాలలో పాల్గొనడం ద్వారా తనలోని  మరొక కోణాన్ని బయట పెడుతున్నాడు రానా.. 



మరింత సమాచారం తెలుసుకోండి: