తెలుగు ఇండస్ట్రీలో గత కొంత కాలాంగా ఎదురు చూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ‘గబ్బర్ సింగ్’ చిత్రం ఉగాది కానుకగా విడుదలైంది. అయితే విడుదలైన ప్రతి సెంటర్ లో మిశ్రమ స్పందన లభించింది. కాకపోతే కలెక్షన్ల పరంగా బాగా దూసుకెళ్తుంది. ఈ చిత్రం విడుదలైన తర్వాత పవన్ కళ్యాన్ కొన్ని చానల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. సినిమా జీవితం, రాజకీయ జీవితం గురించి ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేస్తూ సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నారు. అయితే తాను ఒకటి రెండు చిత్రాల తర్వాత అంటే 2019 నాటికి సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు ప్రకటించారు. ఇకపోతే గతంలో ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ఖుషి సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రంలో పవన్ కళ్యాన్


తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కొమరం పులి అట్టర్ ప్లాప్ అయ్యింది. చాలా కాలం తర్వాత వీరిద్దరి కాంబినేషన్ మరోసారి తెరపై కనిపించబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఖుషి సీక్వెల సెట్స్ పైకి ఎక్కబోతున్నట్లు సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తుంది. మరోవైపు తమిళంలో అజిత్ హీరోగా నటించిన వేదాళం చిత్రం అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే..మాస్ ఓరియెంటెడ్ గా నటించిన ఈ చిత్రంలో అజిత్ అద్భుతమైన నటన కనబరిచారు. ఈ చిత్రం ఇప్పటికే తెలుగులో చిరంజీవి, ఎన్టీఆర్ లాంటి హీరోలు తీయాలని చూసినా అది కూదరలేదు.

తమిళ వేదళం చిత్రంలో అజిత్ కుమార్


తాజాగా  ఇంటర్ వ్యూ లో పవన్ ని ఈ విషయం గురించి అడగ్గా "వేదాళం తెలుగు రీమేక్ కోసం నన్ను సంప్రదించింది వాస్తవమే. ప్రస్తుతం దాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి తెలుగులో చేయాల్సిన మార్పుల గురించి చర్చలు జరుగుతున్నాయని, ఈ చర్చలు ఫలించి ఓ స్పష్టతకు వచ్చాకే వేదాళం రీమేక్ గురించి మాట్లాడుతానని" పవన్ చెప్పుకోచ్చాడు. ఒక వేళ వేదాళం గనక తెలుగు లో అందులోనూ పవన్ నటిస్తే కచ్చితంగా హిట్ అవుతుందని ఆయన అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: