తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సరసన నటించి తెలుగు నటీమణుల్లో మంచి పేరు తెచ్చుకున్న సీనియర్ నటీమణి రాజశ్రీ. తాజాగా సీనియర్ నటీమణి రాజశ్రీ నగలు, వజ్రాలు పట్టపగలు దొంగిలించి పెద్ద సంచలనమే సృష్టించారు. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఆమెను మాయచేసి దొంగ బ్యాగ్ ఎత్తుకెళ్లారు. ప్రస్తుతం రాజశ్రీ (75) చెన్నై లో టీ. నగర్ లో నివసిస్తున్నారు..ఆమె కుమారుడితో కలిసి బ్యాంక్ కు వెళ్లి లాకర్ లో ఉన్న బంగారు ఆభరణాలు, వజ్రాలు తీసుకొని కారులో కూర్చున్నారు.

సీనియర్ నటి రాజశ్రీ


అయితే ఇదంతా గమనిస్తూ వస్తున్న ఓ దొంగ కారులో కూర్చున రాజశ్రీ పక్కన బైక్ ఆపి కారు పక్కన పది రూపాయల నోటు వేసి అమ్మా ఇది మీ డబ్బు అనుకుంటా అంటూ మర్యాదగా అడగడంతో బహుషా తనవే అనుకొని ఆమె కారుదిగి డబ్బు తీసుకునే ప్రయత్నం చేసేలోపే దొంగ కారులో ఉన్న బ్యాగ్ తీసుకొని ఉడాయించాడు.

ఎన్టీఆర్ తో రాజశ్రీ


హఠాత్తుగా జరిగిన సంఘటనతో ఆమె షాక్ తినడం జరిగింది..ఆమె తెరుకునే లోపే దొంగ అక్కడ నుంచి పారిపోయాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: