‘సరైనోడు’ సక్సెస్ మీట్ లో అల్లుఅర్జున్ పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ కు రగిలిపోతున్న పవన్ ఫ్యాన్స్ కు అనుకోకుండా బ్రహ్మానందం అల్లుఅర్జున్ పై వేసిన సెటైర్ పవన్ అభిమానులను మంచి జోష్ లో ఉంచడమే కాకుండా ఇప్పుడు బ్రహ్మీ అన్న కామెంట్స్ ని తమ ఆయుధాలుగా మార్చి బన్నీని టార్గెట్ చేయడం లేటెస్ట్ న్యూస్ గా మారింది. ఈ శక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళితే ‘సరైనోడు’ సక్సస్ సందర్భంగా ఆ సినిమాలో నటించిన బ్రహ్మానందం అల్లుఅర్జున్ తో కలిసి ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది.
ఆ ఇంటర్వ్యూను నిర్వహిస్తున్న ప్రోగ్రాం యాంకర్ బన్నీని టార్గెట్ చేస్తూ ఒక ఆసక్తికరమైన ప్రశ్నను అడిగింది. బ్రహ్మానందంను చూడగానే ఎవరికైనా వెంటనే నవ్వు వస్తుంది కాబట్టి బ్రహ్మీతో నటిస్తున్నప్పుడు మీరు నవ్వు ఎలా ఆపుకున్నారు అంటూ ఆ యాంకర్ బన్నీని ప్రశ్నించింది. అయితే ఈ అనుకోని ప్రశ్నకు షాక్ అయిన అల్లుఅర్జున్ సమాధానం చెప్పడానికి సిద్ధపడుతూ ఉంటే వెంటనే మైక్ అందుకున్న బ్రహ్మీ బన్నీ వైపు చూస్తూ అల్లుఅర్జున్ అలా కనపడుతూ ఉంటాడుకాని చాలామందికి తెలియని అసలు విషయం ఏమిటంటే బన్నీ చాల పెద్ద కోతి అంటూ ఘాటైన సెటైర్ వేసాడు.
అయితే బ్రహ్మీ కామెంట్స్ కు అల్లుఅర్జున్ మురిసిపోతూ తెగ సిగ్గు పడ్డాడు. ఇప్పుడు బ్రహ్మానందం అల్లుఅర్జున్ పై సరదాగా వేసిన సెటైర్ పవన్ వీరాభిమానులకు మంచి అవకాశంలా మారింది. దీనితో బ్రహ్మానందం కామెంట్స్ ను ఉదహరిస్తూ “బన్నీ చాలా పెద్ద కోతి” అంటూ వెబ్ మీడియాలో రకరకాల్ కామెంట్స్ పెడుతూ పవన్ వీరాభిమానులు తమ ఆవేశాన్ని తీర్చుకుంటున్నారు.
బ్రహ్మానందం సరదాగా బన్నీ పై వేసిన సెటైర్ ఇప్పుడు పవన్ వీరాభిమానులకు కలిసి రావడం హాట్ టాపిక్ గా మారడమే కాకుండా పవన్ అభిమానులకు జోష్ ను ఇస్తోంది..