ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ టీజర్ విడుదల అవ్వడం తో ఎక్కడ చూసినా ఆ టీజర్ గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు జనాలు.  ''బలవంతుడు బలహీనుడ్ని భయపెట్టి బ్రతకడం ఆనవాయితీ.. ఫర్ ఏ ఛేంజ్.. ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది..జనతా గ్యారేజ్.. ఇచట అన్ని రిపేర్లు చేయబడును'' అనే డైలాగ్ ఎన్టీఆర్ టీజర్ లో చెప్తుంటే థియేటర్ లో దీనికి వచ్చే రెస్పాన్స్ తలుచుకుంటుంటే నే ఆసక్తిగా అనిపిస్తోంది. ఈ సినిమా ని మలయాళం లో కూడా చాలా గ్రాండ్ గా విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు ప్రొడ్యూసర్ లు.


మలయాళ సూపర్ స్టార్  అయిన మోహన్ లాల్ ఈ సినిమా లో ప్రధాన పోషిoచడం తో మలయాళం లో చాలా రెవెన్యూ ని ఊహిస్తున్నారు. మోహన్ లాల్ వచ్చిన తరవాత ఈ సినిమాకి ఉన్నిముకుందన్, దేవయాని లాంటి మల్లూ స్టార్ లు వచ్చి జేరారు. మల్లు వెర్షన్ లో ఈ సినిమా పోస్టర్ లు కూడా మోహన్ లాల్ ని ప్రధానంగా చూపిస్తూ సాగుతున్నాయి. ఇప్పుడు వచ్చిన తెలుగు జనతా గ్యారేజ్ టీజర్ కాకుండా  స్పెషల్ గా ఒక మలయాళం టీజర్ ని కూడా విడుదల చేసారు ప్రొడ్యూసర్లు మోహన్ లాల్ ని ముందుగా చూపిస్తూ " ఇచట అన్ని రిపేర్లు చెయ్యబడును "అంటూ ఆయనతో చెప్పించి మరీ మోహన్ లాల్ కి ఎలివేషన్ ఇచ్చారు. ఎన్టీఆర్  డైలాగ్స్ న్ని కట్ చేసి మరీ మోహన్ లాల్ డైలాగ్స్ ని పెట్టారు. ఎన్టీఆర్ని మోహన్ లాల్ తరవాత చూపిస్తూ సాగిన ఈ టీజర్ కి మలయాళం లో కూడా సూపర్రెస్పాన్స్ వస్తోంది. ఏదేమైనా ఎన్టీఆర్ కి మలయాళం లో తొలి సూపర్ హిట్ పడే ఛాన్స్ లు కనపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: