మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం 'ఖైదీ నెం.150'. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా జరిగిన మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలలో స్టార్ డైరెక్టర్ వినాయక్'ఖైదీ నెం.150' మూవీలో ఓ డైలాగ్ ని లీక్ చేశారు. అలాంటి డైలాగ్ లు 'ఖైదీ నెం.150' మూవీలో చాలానే ఉన్నాయని చెప్పారు. తను చెప్పిన 'పొగరు నా ఒంట్లో వుంటుంది... హీరోయిజం నా ఇంట్లో వుంటుంది' అనే డైలాగ్ సైతం అభిమానులని మరింతగా ఆకట్టుకుంటుంది.


అయితే వినాయక్ చెప్పిన ఈ డైలాగ్ కేవలం ఫ్యాన్స్ ని ఉద్ధేశించినవి అని ఇండస్ట్రీ  నుండి వినిపిస్తున్న టాక్స్. ఈ రకంగా చూస్తే వినాయక్  'ఖైదీ నెం.150' సినిమాలో ఎక్కువుగా డైలాగ్స్ పైనే ప్రత్యేక శ్రద్ధ చూపినట్టుగా తెలుస్తుంది.  అయితే గతంలో కేవలం ఫ్యాన్స్ ని ఉద్ధేశించి వచ్చిన పవన్ సినిమా సర్ధార్ గబ్భర్ సింగ్. పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ప్రకారం ఇది కేవలం అభిమానుల కోసమే  వస్తున్న సినిమా అని చెప్పుకొచ్చారు.


ఆ విధంగానే అభిమానుల కోసమే అన్నట్టుగా సినిమాలోని కొన్ని సన్నివేశాలు, మేనరిజాలు పెట్టుకున్నారు. ఇలా పెట్టుకోవటంతో సర్ధార్ గబ్భర్ సింగ్ మూవీ రిలీజ్ తరువాత ఇది కేవలం ఫ్యాన్స్ మూవీ మాత్రమే అని ముద్ర పడింది. అందుకే సర్ధార్ గబ్భర్ సింగ్ మూవీకి సాధారణ ప్రేక్షకులు దూరం అయ్యారు. ఇక అలాగే రామ్ చరణ్ నటించిన బ్రూస్ లీ చిత్రం సైతం కేవలం ఫ్యాన్స్ కోసమే అన్నట్టు చిత్రీకరణ జరిగింది.


ఈ విషయం మెగాస్టార్ సైతం తెలుసుకుంటే మంచిదని ఇండస్ట్రీ నుండి కొందరు ప్రముఖులు అంటున్నారు. ఆ విధంగానే ఖైదీ నెంబర్.150వ చిత్రం అంతా ప్యాన్స్ కోసమే అన్నట్టు చిత్రీకరణ జరిగితే మాత్రం మెగాస్టార్ ఇరుకున పడ్డట్టే అని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: