‘సీమటపాకాయ్’, ‘అవును’ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ పూర్ణ ఈసారి వరుణ్ సందేశ్ తో జోడి కట్టనుంది. వరుణ్ సందేశ్ హీరోగా అమోఘ్ క్రియేషన్స్ సంస్థ నిర్మించే సినిమాలో పూర్ణ హీరోయిన్ గా నటించనుంది. ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ ‘వినోదం మేళవించిన ప్రేమ కథ ఇది. యువతకు నచ్చేలా ఈ సినిమాను తెరకెక్కనుందని’ తెలిపారు. నిర్మాత ఇందూరి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఈ చిత్రానికి ‘నువ్వలా.. నేనిలా’ అనే టైటిల్ ఖరారు చేశామని, ఈ నెల 13 నుంచి షూటింగ్ ప్రారంభం అవుతుందని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: