పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ మసాలా డైరక్టర్ బోయపాటి శ్రీను డైరక్షన్లో సినిమా తీస్తే అసలు అంచనాలకే అందని ఈ కాంబో తెర రూపం దాల్చబోతుంది. తన హీరోలను పవర్ ఫుల్ మిసైల్ లా చూపించే బోయపాటి చేతిలో పవన్ కళ్యాణ్ పడితే ఎలా ఉంటుంది. ప్రస్తుతం ఈ క్రేజీ కాంబినేషన్ కు సంబందించిన సినిమా చర్చలు జరుగుతున్నాయట. దాసరి నిర్మాణంలో తారకప్రభు ఫిలంస్ నిర్మించే సినిమాలో ఓ సినిమా కమిట్ అయ్యాడు పవన్ కళ్యాణ్.

 

దాదాపు రెండేళ్లుగా నలుగుతున్న ఈ సినిమా మ్యాటర్ ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది. రీసెంట్ గా పవన్ బర్త్ డే రోజు తారక ప్రభు ఫిలంస్ వారు పవన్ తో తమ సినిమా ఎనౌన్స్ మెంట్ చేశారు. అయితే ఈ సినిమాకు దర్శకుడిగా ముందు త్రివిక్రంను౦. అనుకున్నా త్రివిక్రంతో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ రాధాకృష్ణ సినిమాకు సిద్ధమయ్యాడు. అందుకే దాసరి నిర్మాణంలో బోయపాటిని డైరక్టర్ గా సెలెక్ట్ చేస్తున్నారట.

 

రీసెంట్ గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను సరైనోడుగా సూపర్ హిట్ అందుకున్న బోయపాటి బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఆ సినిమా తర్వాత మెగాస్టార్ తో సినిమా తీసే ప్రయత్నాల్లో ఉన్న బోయపాటికి దాసరి ఈ ఆఫర్ ఇస్తున్నట్టు టాక్. అయితే పవన్ తో సినిమాకు బోయపాటి రెడీ అంటున్నా పవన్ ఏం అంటాడా అన్నది ఇంకా తెలియలేదు. ఓ పక్క డాలితో కాటమరాయుడా షూట్లో ఉన్న పవన్ తన తర్వాత సినిమా త్రివిక్రంతో ఫిక్స్ అయ్యాడు.

 

పవన్ కళ్యాణ్, బోయపాటి కాంబినేషన్ కనుక కుదిరితే ఇండస్ట్రీ రికార్డుకు షురూ అయినట్టే. హీరో ఇమేజ్ ను పదింతలు పెంచేలా ఊర మాస్ కథాంశాలతో తెరకెక్కే బోయపాటి పవన్ ను డైరెక్ట్ చేస్తే అది కచ్చితంగా ఓ ప్రత్యేక సినిమా అవుతుందని చెప్పొచ్చు. మరి ఈ కాంబినేషన్ కు సంబందిచిన మరిన్ని డీటేల్స్ త్వరలో వెళ్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: