సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్‌ కు బంఫర్ ఛాన్స్ తగిలింది. తన కెరియర్ లో తొలిసారిగా ఒక స్టార్ తో పనిచేసే అవకాశం లభించింది. జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు సంగీతం అందించే అవకాశం అనూప్ రెబెన్స్ కు వచ్చింది. 

జూనియర్ ఎన్టీఆర్ -సంతోష్ శ్రీనివాస్ కలయికలో ఒక చిత్రం రూపొందనుంది. బెల్లంకొండ సురేష్ నిర్మించే ఈ సినిమాకు అనూప్ రూబెన్స్  సంగీతం అందిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ ఇప్పటికే మంచి సంగీత దర్శకుడిని ప్రూప్ చేసుకున్నారు. అతను స్వరపరిచిన ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లయ్యింతయ్యందే’ పాటలు మంచి ప్రజాధరణ పొందాయి. ఇప్పుడు అతనికి ఎన్టీఆర్ తో పనిచేసే అవకాశం రావడం అదృష్టమని చెప్పుకోవాలి.

కాగా ఈ జూనియర్ ఎన్టీఆర్ నటించే ఈ రభస సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: