టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకవైపు యాంకర్ గా చేస్తున్న ఫిమేల్ యాంకర్స్...మరోవైపు సినిమాల్లోనూ నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందులో పముఖంగా ఈ మధ్య కాలంలో ముగ్గురు పేర్లు ఎక్కువుగా వినిపిస్తున్నాయ. అనసూయ, రష్మీ, శ్రీ ముఖి. ఈ ముగ్గురు యాంకర్స్ టీవి ప్రోగ్రామ్స్ చేస్తూనే...సినిమాల్లోనూ నటిస్తున్నారు. అయితే వీరిందరిలో కంటే అనసూయ కి ఇండస్ట్రీలో ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి.
టాప్ హీరోలకి సంబంధించిన మూవీల్లో అనసూయ చేత స్పెషల్ సాంగ్స్ చేయిస్తే..ఫుల్ క్రేజ్ ఉంటుందని భావిస్తున్నారు. అందుకనే ఈ బ్యూటిని చాలా మంది డైరెక్టర్స్ అప్రోచ్ అవుతున్నారు. ఇక తాజాగా మెగాహీరో సాయిధరమ్ తేజ్ నటించిన ‘విన్నర్’ మూవీలోనూ అనసూయ స్పెషల్ సాంగ్ చేసింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించి థమన్ అందించిన ఆడియో ఇప్పటికే ఫుల్ క్రేజ్ ని క్రియేట్ చేసుకుంది.
ఇప్పటి వరకూ ఈ మూవీకి సంబంధించిన ఒక్కో పాటను ఒక్కో స్టార్ చేత విడుదల చేయిస్తున్నారు. ఇక మూవీలోని ‘సుయ సుయ’ పాటలో అనసూయ డ్యాన్స్ ఇరగదీసిందట. అనసూయ మీద వచ్చిన ఈ స్పెషల్ సాంగ్ లో ఈ బ్యూటీ అందాలు సైతం కెవ్వు కేక పుట్టించేలా ఉంటాయని అంటున్నారు. అనసూయ స్పెషల్ సాంగ్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఇక నుండి చాలా మంది హీరోల మూవీలలో ఈ బ్యూటీ డ్యాన్స్ చేయనుంది.
అయితే ఇప్పటి వరకూ సాంగ్స్ లో పొట్టి డ్రస్సులకి అవకాశం ఇవ్వని అనసూయ...ఇక నుండి పొట్టి డ్రస్సులకి అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని అంటున్నారు. సాయిధరమ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు నిర్మించారు.