ప్రస్తుతం థియోటర్స్ లో హల్ చల్ చేస్తున్న మూవీ ‘సింగం 3’. సూర్య నటించిన ఈ ‘సింగం 3’ భారీ అంచానాల నడుమ విడుదలైంది. మొదటి రోజు ఈ చిత్రంపై  మిశ్రమ స్పందన రావటంతో....చిత్ర యూనిట్ స్పంధించి ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ని మరింతగా పెంచారు. దీంతో ‘సింగం 3’ సినిమా బాగుందని...ఏకంగా హీరో వచ్చి వరుస ప్రెస్ మీట్స్‌ ని పెట్టారు.

అంతే కాకుండా ‘సింగం 3’ పై పాజిటివ్‌ టాక్స్ ని వచ్చే విధంగా మీడియాపై నిర్మాతలు ఫోకస్ పెట్టారు. దీని కారంగా ‘సింగం 3’ మూవీపై ప్రస్తుతం అంతటా పాజిటివ్‌ టాక్స్ వస్తున్నాయి. తాజా ‘సింగం 3’ సక్సెస్ మీట్లో పాల్గొని సంచలన స్టేట్మెంట్స్ చేశారు.  దర్శకుడు హరి రాబోయే రోజుల్లో ‘సింగం 4’ కూడా తీస్తానని చెప్పటం విశేషంగా మారింది.

అందుకు హీరో సూర్య సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే కొన్ని లెక్కలను చూసుకుంటే ‘సింగం 3’ మూవీకి డిస్ట్రిబ్యూటర్స్ నష్టాలను చూడాల్సి వస్తుందని అంటున్నారు. దీని కారణంగా ‘సింగం 3’ మూవీకి కొంత మేర నష్టాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

ప్రస్తుతం ‘సింగం 3’ మూవీపై పాజిటివ్‌ టాక్స్ కోసం హీరో ఈ మూవీకి సీక్వెల్ ఇంకా ఉంటుందని చెప్పి ఉండొచ్చు కానీ...ప్రాక్టికల్ గా ‘సింగం 3’కి భవిష్యత్ లో సీక్వెల్ ఉండదని అంటున్నారు. ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్స్ ‘సింగం 3’కి లాభాలను చూడలేకపోవటంతో ఇది కొంత ఇష్యూగా మారే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ మూవీకి సంబంధించిన డైరెక్టర్ ‘సామి 2’ త్వరలోనే సెట్స్ మీదకు తీసుకువెళ్ళనున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: