రామ్ చరణ్ డిఫరెంట్ లుక్ తో కనిపించిన ‘ధృవ’ మూవీకి మంచిపేరు రావడంతో ఇక అటువంటి డిఫరెంట్ సినిమాల వైపే చరణ్ అడుగులు వేస్తున్నాడు. దీనికి కొనసాగింపుగా రామ్ చరణ్ సుకుమార్ దర్సకత్వంలో నటించబోతున్న మూవీలో ఒక కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు అన్న వార్తలు ఇప్పటికే వచ్చాయి. 

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం సుకుమార్ సినిమాకు సంబంధించి ఈమధ్య రామ్ చరణ్ పై 15 మేకప్ లుక్ టెస్ట్ లు జరిగాయి అన్న వార్తలు వస్తున్నాయి. ఈసినిమాలో చాల డిఫరెంట్ గా చరణ్ ను చూపించాలి అన్న ఉద్దేశ్యంతో సుకుమార్ చరణ్ కు కొన్ని స్పష్టమైన సూచనలు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈ మూవీలో చరణ్ సన్నగా కనపడాలి అని సుకుమార్ సూచించిన నేపధ్యంలో చరణ్ గత కొద్ది కాలంగా కేవలం విజిటేరియన్ ఫుడ్ మాత్రమే తింటున్నాడని టాక్. దీనికితోడు చరణ్ ఒక డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో గడ్డంతో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. 1980 కాలంనాటి ప్రేమ కథ కాబట్టి చరణ్ లుక్ లో కూడ చాల వైవిధ్యం ఉండాలని సుకుమార్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈ నేపధ్యంలో ఈమధ్య చరణ్ పై ఈ సినిమాకు సంబంధించి ఒక ప్రత్యేకమైన ఫోటో షూట్ ను 15 లుక్స్ తో సుకుమార్ తీసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ 15 లుక్స్ లో అనేక వడబోతలు తరువాత ఒక లుక్ ను డిసైడ్ చేసి ఆ లుక్ తో ఈసినిమా షూటింగ్ ప్రారంభించాలని సుకుమార్ ఆలోచన అని అంటున్నారు. ఈమూవీలో చెవిటి వాడిగా చరణ్ కనిపిస్తున్న నేపధ్యంలో మెగా అభిమానులు ఎటువంటి నిరాశ పడకుండా చరణ్ లుక్ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటూ చరణ్

మెగా అభిమానులకే కాకుండా క్లాస్ ప్రేక్షకులకు కూడ నచ్చే విధంగా మార్చాలని సుకుమార్ పెద్ద హోమ్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈమూవీ ముగిసిన తరువాత చరణ్ మణిరత్నం దర్శకత్వంలో ఒక ప్యూర్ లవ్ స్టోరీ చేయబోతున్నాడు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో చరణ్ తన సినిమాల ఎంపికలో చాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: