![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/pawan kalyan katamarayudu movie-415x250.jpg)
ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మూవీలకి సంబంధించిన నిర్మాణం వేగంగా జరుగుతుంది. ప్రతి హీరో సంవత్సరానికి కనీసం రెండు మూవీలను చేయటానికి రెడీగా ఉన్నారు. హీరోలు ఎక్కువ మంది ఉండటంతో…సక్సెస్ ని ఇచ్చే డైరెక్టర్స్ సంఖ్య తక్కువయిందని చెప్పాలి. దీంతో చాలా సంవత్సరాల తరువాత ఫిల్మ్ ఇండస్ట్రీలో డైరెక్టర్స్ కొరత ఏర్పడిందని చెప్పవచ్చు.
![](https://1.bp.blogspot.com/-G8PTdx5lN8g/WM1i7cv7ttI/AAAAAAAAcYY/ookCCENmcNUX1Tj5r3nUpkjutX6N-FPRACLcB/s1600/Pawankalyan-at-katamarayudu-pre-release-event-02.jpg)
ఇదిలా ఉంటే తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు కి స్టార్ హీరో పవన్ కళ్యాణ్ షాక్ ఇచ్చాడని అంటున్నారు. గతంలో ఈ ఇద్దరు హీరోలు సంవత్సరానికి ఒక మూవీని ప్లాన్ చేసుకునే వాళ్ళు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ తన మూవీని ఒకటిన్నర సంవత్సరానికి ఒకటి చొప్పున ప్లాన్ చేసుకున్నారు. కానీ మహేష్ బాబు సంవత్సరానికి రెండు మూవీల వరకూ ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు. దీని వల్ల మార్కెట్ లో మహేష్ బాబుకి డిమాండ్ క్రియేట్ అయింది. అయితే ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది.
![](http://images.tollywoodbackstage.com/2016/03/mahesh-babu-refuses-shirtless_xl.jpg)
పవన్ కళ్యాణ్ తన మూవీల వేగాన్ని పెంచాడు. సంవత్సరానికి రెండు మూవీలు తప్పనిసరి…కుదిరితే మూడో మూవీ కూడ ఉంటుందని అంటున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ఎన్నడూ లేని విధంగా వరుస సినిమాలకు సైన్ చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు. తాజాగా ‘కాటమరాయుడు’ షూటింగ్ ని పూర్తి చేసిన పవన్ కళ్యాణ్, త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కొత్త చిత్రాన్ని మొదలుపెట్టనున్నాడు. ఈ చిత్రం కూడ త్వరగా పూర్తి చేయనున్నారు. ఆ తరువాత వెంటనే మరో చిత్రాన్ని స్టార్ట్ చేసేందుకు పవన్ కళ్యాణ్ రంగం సిద్ధం చేసుకున్నారు.
![](http://southscope.in/wp-content/uploads/2017/01/Mahesh-Babu-goes-to-Kashmir-for-Brahmotsavam-Shooting.jpg)
తమిళ దర్శకుడు ఆర్టీ నీసన్ తో సినిమా చేయనున్నారు. ఇలా ఈ వరుస మూడు ప్రాజెక్టులతోనే పవన్ కళ్యాణ్ రెడీ కావటంతో ప్రిన్స్ మహేష్ బాబు సైతం పవన్ దూకుడుకి షాక్ అవుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ యాక్టివ్ గా సినిమాలని చేయటంతో మార్కెట్ లో ప్రిన్స్ మహేష్ బాబు రేటు కాత్త తగ్గిందని అంటున్నారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ ఎక్కువ చిత్రాలు నటించేందుకు గ్రీన్ సిగ్నల్స్ ఇస్తుండంతో అభిమానులకి ఇది ఫుల్ జోష్ ని ఇస్తుందని అంటున్నారు.