తెలుగు ఇండస్ట్రీలో ‘అలా మొదలైంది’ చిత్రంతో హీరో నానీ సరసన నటించింది మళియాల ముద్దుగుమ్మ నిత్యామీనన్.  బొద్దుగా ముద్దగా ఉండే నిత్యా మీనన్ బాలనటిగా నటించి తర్వాత హీరోయిన్ అయ్యింది.   తక్కువ కాలంలోనే తెలుగు, తమిళ, మళియాల ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారిపోయింది.  నటన లో తనకంటూ ఒక ప్రత్యెక శైలి ని ఏర్పరచుకున్న హీరోయిన్ నిత్యా మీనన్.  అంతే కాదు ఈ మూడు ఇండస్ట్రీలో హీరోయిన్ గానే కాకుండా సెకండ్ హీరోయిన్ గా కూడా నటించి మెప్పించింది.  ఇక సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కాంట్రవర్సీలకు కేంద్ర బింధువుగా నిలుస్తుంది ఈ అమ్మడు.  
Related image
ఆ మద్య సహజీవనం (డేటింగ్) పై ఓపెన్ గా మాట్లాడుతూ..పెళ్లికి ముందు నచ్చిన వాడితో ఉండటం తప్పు కాదని ఒకవేళ ఇద్దరి మద్య ఏవైనా అభిప్రాయ భేదాలు వస్తే సమస్య అప్పుడే క్లియర్ అవుతుందని అంటూ హాట్ గా కామెంట్ చేసింది.  అయితే ఆ సమయంలో ‘ఒకే బంగారం’ సినిమా కోసం ప్రమోషన్ లో భాగంగా ఈ మాటలు అన్నదని వార్తలు వచ్చాయి. మరోసారి సహ హీరోయిన్లపై కూడా కామెంట్ చేసింది.  ఏది ఏమైనా ఈ అమ్మడు నటించిన సినిమాలు దాదాపు అన్ని విజయవంతమైనవి కావటం మరో విశేషం.

కాకపోతే మొన్నామధ్య ఒక్క అమ్మాయి తప్ప సినిమా మీద బోలెడు ఆశలు పెట్టు కున్న నిత్యకి ఆ చిత్రం పెద్ద ప్లాప్ నే అందించింది.  దీంతో నైరాశ్యంలో ఉన్న నిత్య ఆ సినిమా తరవాత ఆమెని అప్ప్రోచ్ అయిన దాదాపు అందరు ప్రొడ్యూసర్ లనీ నిత్యా మీనన్ తోసిపుచ్చింది. ఇక తెలుగు సినిమాల్లో కొన్ని అవకాశాలు వచ్చినా..సున్నితంగా తిరస్కరించిన నిత్య ఇప్పుడు తమిళం , మలయాళం ప్రొడ్యూసర్ లకి కూడా ఇదే సమాధానం చెబుతోంది.  

అయితే దీని వెనుక మరో కారణం కూడా ఉందట..నిత్యా మీనన్ కి మొదటి నుంచి నటన కన్నా దర్శకత్వం, స్క్రిప్ట్ రైటింగ్ మీద ఎక్కువ శ్రద్ద ఉండేదట.  అంతే కాదు తెలుగు - మలయాళం కోసం ఒక ద్విభాషా చిత్రం తీయాలి అని చూస్తున్న ఆమె సొంతగా ఒక స్క్రిప్ట్ ని కూడా రాసుకోవడం విశేషం. సో ప్రొడ్యూసర్ గా అయినా ఈ స్క్రిప్ట్ ని ముందరకి నడిపించాలి అని చూస్తున్న నిత్య సినిమాలకి దాదాపు గుడ్ బై చెప్పెసినట్టే అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: