తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకన్న నటులు రజినీకాంత్.  కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటులు రజినీకాంత్.  అలాంటి రజినీకి అల్లుడు అయ్యే అదృష్టాన్ని కొట్టేశాడు హీరో ధనుష్.  అయితే తన మామ పేరు ఉపయోగించకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చున్నాడు ధనుష్.  హీరోగా, సింగర్ గా రాణిస్తున్న ధనుష్ గత కొంత కాలంగా కష్టాల్లో మునిగిపోయాడు.  ధనుష్ మా కొడుకే అంటూ కదిరేశన్ - మీనాక్షి అనే వృద్ధ దంపతులు కోర్టు ని ఆశ్రయించిన విషయం తెలిసిందే.  
Image result for danush suchi leaks
ఆ మద్య సుచీలీక్స్ ప్రభావం మనోడి విపరీతంగా పడింది.  ఒకదశలో ధనుష్, అనిరుధ్ ఇద్దరు కలిసి తనకు మత్తు మందు ఇచ్చి లైంగిక దాడి చేసినట్లు ట్విట్టర్ లో పెట్టడంతో ధనుష్ పరిస్థితి మరీ దారుణంగా మారింది.  ఇవన్నీ తనపై గిట్టని వారు చేస్తున్నవే అని కొట్టిపడేశాడు.  అయితే కదిరేశన్ - మీనాక్షి అనే వృద్ధ దంపతులు  కూడా ఆయనను నీడలా వెంటాడుతున్నారు.  
Image result for danush parents
తాజాగా ధనుష్ కు డిఎన్ ఏ పరీక్షలు నిర్వహిస్తే అసలు విషయం బయటపడుతుంది కాబట్టి డిఎన్ ఏ టెస్ట్ చేయాలంటూ మరో పిటీషన్ ని మధురై కోర్టులో వేశారు కదిరేశన్ దంపతులు . దాంతో ధనుష్ కు మరిన్ని కష్టాలు వచ్చాయి.  ఆ మద్య తన ఒంటిపై ఉన్న పుట్టు మచ్చలు లేజర్ తో చెడిపి వేశాడని కూడా వార్తలు వచ్చాయి.  
Image result for danush father
మరోవైపు  డిఎన్ ఏ టెస్ట్ కు ధనుష్ అంగీకరించడం లేదని ఎందుకంటే ఇది స్వేచ్ఛ కు , ఆత్మ గౌరవానికి సంబందించిన వ్యవహారం అంటూ ధనుష్ లాయర్ గట్టిగానే వాదించాడు . ఇప్పటికైతే కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా కేసు ని వాయిదా వేసింది  కానీ ఈ వ్యవహారం ఓ కొలిక్కి రాకపోతే తప్పనిసరిగా డిఎన్ ఏ టెస్ట్ కు సహకరించమని ధనుష్ ని కోరడం ఖాయంగా కనిపిస్తోంది . పాపం ధనుష్ కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు.



మరింత సమాచారం తెలుసుకోండి: