Related image



కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? 
శివగామి చేసిన పాపం ఏమిటి? 
శివగామే బాహుబలిని చంపించిందా? 
దేవసేనను బాహుబలి పెళ్లి చేసుకుంటే.. భల్లాలదేవుడి భార్య ఎవరు?


Image result for bahubali devasena images



ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా రాజమౌళి, బాహుబలి ది బిగినింగ్‌, కు శుభం కార్డు వేసి, మిగతా సినిమాను బాహుబలి ది కన్‌క్లూజన్ లో చూడంటంటూ మెలికలో మలుపు ఇచ్చి వదిలేశాడు. ఈ ప్రశ్నలకు ఆన్సర్ దొరికే రోజు దగ్గర పడటంతో ప్రేక్షకులు ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా విడుదలకు ముందే బాహుబలి 2 కథ ఇదే అంటూ సోషల్ మీడియా లో ఓ కథ చక్కర్లు కొడుతుంది. పక్కా కంటెంట్‌ తో ఉన్న ఆ కథలో ఈ ప్రశ్నల్లో చాలా వాటికి ఆన్సర్ దొరికేసింది.  ఆ కథ ఏంటో చూద్దాం...


Related image



బాహుబలి కన్‌క్లూజన్ కథ 

గిరిజన రాజు కూతురు దేవసేనను బాహుబలి ప్రేమిస్తాడు. కానీ ఆమె నగరానికి రావటానికి నిరాకరిస్తుంది. ఆమెతోనే గడుపు తుంటాడు బాహుబలి. భల్లాల దేవుడు అతడిని ప్రోత్సహించి దేవసేనతోనే ఉండటం న్యాయమంటాడు. కానీ రాజమాతకు మాత్రం లేనిపోనివి నూరిపోస్తాడు. తద్వారా రాజ్య పెత్తనం తాను తీసుకుంటాడు. అక్కడినుంచీ బాహుబలిని నిర్మూలించటానికి ప్రణాళికలు వేస్తాడు.



Related image



తన మనుషులతోనే అరాచకాలు చేయించి అవన్నీ ఆటవికసైన్యం చేస్తోందనీ, వారికి బాహుబలి మద్దతు ఉందనీ చెప్తాడు. దీంతో రాజమాత శివగామి ఆగ్రహిస్తుంది. తన వద్దకు రావాలని బాహుబలిని ఆదేశిస్తుంది. కానీ ఆ ఆదేశాలు బాహుబలికి చేరకుండా భల్లాల దేవుడు కుట్ర చేస్తాడు. ఈ లోగా మాహిష్మతి సైన్యం ఆటవికులను దోచు కోవటం, గిరిజన స్త్రీలను చెరబట్టటం చేస్తుంటుంది.


Image result for bahubali devasena images




ఇదేమీ శివగామికి తెలియనివ్వకపోగా ఆటవికుల దాడులు అధికమయ్యాయనీ, ప్రజలు ప్రశాంతంగా జీవించలేకపోతున్నారనీ చెప్తుంటారు. దీంతో బాహుబలిని బంధించి తేవాలని రాజమాత ఆదేశిస్తుంది. అదే భల్లాల దేవునికి కావలసింది. సైన్యంతో బయలు దేరుతాడు. కట్టప్ప కోటకు కాపలాగా ఉంటాడు. భల్లాలదేవుని దండయాత్ర గురించి తెలిసి దేవసేన, బాహుబలి ఎదురువెళతారు. బాహుబలిని చూసి సైన్యం చీలిపోతుంది. భల్లాలదేవుడి దుష్ట అనుచరులు ఒకవేపు, బాహుబలిని అభిమానించే సైన్యం ఓ వేపు.



Image result for bahubali devasena images



ఈ విషయం రాజమాతకు వేగులు చేరవేయగా ఆమె తీవ్రంగా ఆగ్రహించి రక్తసంబంధం కన్నా రాజ్యమే గొప్పదనీ, బాహుబలిని బంధించి, లేదా అంతం చేసి ఈ యుద్ధానికి ముగింపు పలకాలనీ ఆజ్ఞాపిస్తుంది. కట్టప్ప భారమైన మనసుతో రాజమాత ఆదేశాలతో యుద్ధభూమికి వెళతాడు. అప్పటికే యుద్ధం తీవ్రంగా జరుగుతుంటుంది. భల్లాల దేవుడు ఓడిపోతుంటాడు. బాహుబలి భల్లాల దేవుడిని జయించే సమయంలో కట్టప్ప బాహుబలిని చంపేసి రాణి ఆజ్ఞ పాటిస్తాడు.



Related image



భల్లాల దేవుడి నుంచి తప్పించుకున్న దేవసేన రాజమాత వద్దకు న్యాయం కోసం బయలు దేరుతుంది. భల్లాలదేవుడు ఆమెను వెంటాడుతూ కోటకు చేరుకుంటాడు. దేవసేన తన బిడ్డను రాజమాతకు అప్పగించి జరిగినదంతా చెపుతుంది. రాజమాత పశ్చాత్తాప పడుతుంది.



Image result for bahubali devasena images


ఆ బిడ్డను కూడా చంపితే శత్రుశేషం ఉండదని భల్లాల దేవుడు, అతడి తండ్రీ అనుకుంటారు. కానీ రాజమాత బిడ్డను తీసు కుని పారిపోతుంది. ఆమె విశ్వాసపాత్రులంతా అప్పటికే బాహుబలితో పాటు చావటమో, అడవిపాలు కావటమో జరిగింది. రాజమాతకే దిక్కులేని పరిస్థితి. ఆమెను వెంటాడుతూ భల్లాల దేవుని అనుచరులు కొండ కిందివరకూ వస్తారు. బాలుడితో సహా రాజమాత నదిలో పడి చనిపోయిందని భల్లాల దేవుడికి చెప్తారు.


అతడు దేవసేనను బంధించి, కట్టప్పను విశ్వాసబంధంలో బిగించి అరాచక పాలన సాగిస్తుంటాడు. తమ బిడ్డను రక్షించు కోవటానికి ఆటవికులు ప్రయత్నాలు చేస్తుంటారు. రెండోబాహుబలి సాయంతో వారు భల్లాల దేవుని ఎలా ఓడించారు.? మళ్లీ బాహుబలి ఎలా రాజయ్యాడు.? దేవసేన రాజమాతగా మారి శివగామి ఆత్మకు శాంతి ఎలా చేకూర్చింది అన్నది ఊహించదగ్గ కథే కదా!  ఇదే రాజమౌళి సృష్టించిన బాహుబలి కంక్లూజన్.



Image result for bahubali devasena images



అయితే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ బాహుబలి2 కథ ఎప్పటి నుండో  ఉన్నప్పటికీ సినిమా విడుదల దగ్గర పడటంతో కన్‌క్లూజన్ కథ షేర్ మీద షేర్ అవుతూ సంచలనంగా మారింది. అయితే ఈ కథ నిజమా?  కాదా?  అన్నది పక్కన పెడితే,  రాజమౌళి ఒరిజినల్ కథకు ఏ మాత్రం తీసుపోకుండా ఈ కథను రాసేశారు. అయితే రాజమౌళి బాహుబలి 2 విషయం లో లీక్‌లు బయటకు పోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో కథ బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఇది "నెటిజన్ మేడ్ ఫేక్ కథ" అని కొట్టిపారేస్తున్నారు సినీ విశ్లేషకులు.


Image result for bahubali devasena images

మరింత సమాచారం తెలుసుకోండి: