‘బాహుబలి 2’ సాధించిన అఖండ విజయం వెనుక రాజమౌళి ప్లానింగ్ ప్రతిభతో పాటు ప్రభాస్ పడ్డ కష్టానికి అందరు ప్రశంసలు కురిపిస్తూ ఉంటే ఈ అనూహ్య విజయం వెనుక ఒక సెంటిమెంట్ ఉంది అన్న విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సెంటిమెంట్ విషయం హాట్ టాపిక్ గా మారింది.
ఏప్రియల్ 28వ తారీఖు అయ్యప్ప స్వామి భక్తులకు ఒక ప్రత్యేకతతో కూడుకున్నరోజు. ఆరోజు అయ్యప్ప పుట్టినరోజు. అదేవిధంగా ఈ డేట్ కు గతంలో కూడ తెలుగు సినిమా రికార్డులను తిరగ వ్రాసిన చరిత్ర ఉంది. 40 సంవత్సరాల క్రితం సీనియర్ ఎన్టీఆర్ రాఘవేంద్రరావుల కాంబినేషన్ లో వచ్చిన ‘అడవిరాముడు’ సరిగ్గా ఇదే ఏప్రియల్ 28న విడుదలై ఆరోజులలో తెలుగు సినిమా కలక్షన్స్ రికార్డులను బ్రేక్ చేసింది.
అదేవిధంగా మహేష్ కెరియర్ ను ఒక మలుపు తిప్పి అతడిని సూపర్ స్టార్ గా మార్చిన ‘పోకిరి’ 2006 ఇదే ఏప్రియల్ 28న విడుదలై ఆరోజులలో 100 కేంద్రాలలో శతదినోత్సవం చేసుకుంది. ఇలా ఈ డేట్ కు టాలీవుడ్ కలక్షన్స్ ను తిరిగ వ్రాసిన సెంటిమెంట్ కు అవినాభావ సంబంధం ఉంది.
అందువల్లనే ‘బాహుబలి 2’ సాధించిన ఈ ఘన విజయం వెనుక ఒకనాటి నందమూరి తారకరామారావు ఈనాటి సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ లకు సంబంధించిన ఆనాటి ఆసినిమాల అదృష్టం కూడ ప్రభావితం చేసింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్లతో కూడుకున్న రంగం కాబట్టి ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఈ ఏప్రియల్ 28 ప్రభావం ప్రభాస్ సినిమా ‘బాహుబలి 2’ పడింది అని భావించడంలో ఎటువంటి సందేహం లేదు అన్నది కొందరి విశ్లేషకుల వాదన..
అందుకే కాబోలు ప్రస్తుత సినిమారంగ చరిత్రని ‘బాహుబలి’ ముందు ‘బాహుబలి 2’ తరువాత అన్న విధంగా విభజించి చూడవలసిన పరిస్థుతులు ఏర్పడ్డాయి అని విమర్శకులు కామెంట్స్ చేస్తున్నారు..