తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల వారసులు ఎంట్రీ ఇస్తున్న సమయంలో స్టార్ ప్రడ్యూసర్ డి.రామానాయుడు మనవడిగా డి.సురేష్ బాబు తనయుడు రానా ‘లీడర్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  మొదటి సినిమా లో చాలా హుందాగా నటించిన రానా తర్వాత వచ్చిన కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రంలో యాక్షన్ హీరోగా నటించాడు.  అయితే తెలుగు, హిందీ ఇండస్ట్రీలో రానా హీరోయిజానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా ఎలాంటి పాత్రల్లోనైనా జీవిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్నాడు.  
Image result for rajiv gandhi murder
ఇక రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబాలి’, ‘బాహుబలి 2’ లో భళ్లాలదేవగా నటించి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.   ఈ చిత్రంలో రానా ప్రతినాయకుడి పాత్రలో కనిపించినా ప్రభాస్ కి వచ్చినంత పేరు వచ్చింది.  ఘాజీ' సినిమాలతో... దేశవ్యాప్తంగా తనకంటూ ఓ డిఫరెంట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు రానా. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ మూవీస్ కే కాక... వార్ బ్యాక్ డ్రాప్ సినిమాలకు తను పర్ఫెక్ట్ గా యాప్ట్ అవుతానని ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో 'నేనే రాజు.. నేనే మంత్రి' అనే పొలిటికల్ థ్రిల్లర్ లో నటిస్తున్నాడు.

దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య పై కన్నడ డైరెక్టర్ ఏఎంఆర్ రమేశ్ ఓ సినిమా నిర్మించే ప్రయత్నంలో ఉన్నాడు.... తెలుగు, తమిళ, కన్నడ భాషలతో పాటు హిందీలోనూ ఈ సినిమా తెరకెక్కించబోతున్నారట. హిందీ నటుడు రవి కాలే ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.   అప్పట్లో రాజీవ్ హత్య కేసుపై విచారణ జరిపిన సీబీఐ ఆఫీసర్ డి.ఆర్. కార్తికేయన్ పాత్రను రానా పోషించబోతున్నాడట.... ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతుండగా.. త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కు రానా ఎంతవరకూ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో తెలియాలంటే.. ఇంకొద్దిరోజులు తెలిసిపోతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: