తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘డీజే’ అనే పదమే వినిపిస్తుంది. దర్శకుడు హరీష్ శంకర్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న ‘దువ్వాడ జగన్నాథం’ ఈ నెల 23 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి సిద్దంగా ఉంది. ఆ మద్య డీజే లో 'గుడిలో బడిలో మడిలో వడిలో' సాంగ్ లో దైవాన్ని కించపరిచే కొన్ని పదాలు ఉన్నాయిని బ్రాహ్మణ సంఘాలు నిరసన తెలిపాయి. అయితే ఈ విషయంలపై హరీష్ శంకర్ స్వయంగా ఓ చానల్ లో ఆ పదాల భావాలు..ఆ పదాలు సినిమాల ఎందుకు ఉపయోగించారు అన్ని విషయం గురించి చెప్పారు.
రీసెంట్ గా ‘దువ్వాడ జగన్నాథం’ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో కూడా ఈ విషయంపై ఏమీ చర్చించలేదు. ఈ పాటలో అభ్యంతరంగా ఉన్న పదాలను తొలగిస్తామని ముందుగా తమకు హామీ ఇచ్చిన దర్శకుడు హరీశ్ శంకర్.. ఇప్పుడు మాట తప్పారని, తాము చూస్తూ ఊరుకోబోమని ఈ రోజు బ్రాహ్మణ సంఘాల సభ్యులు హెచ్చరిస్తూ తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో దర్శకుడు హరీష్ శంకర్ దెబ్బకు దిగివచ్చినట్లు తెలుస్తుంది.
ఆ పాటలో వివాదాస్పదమైన పదాలను తాము స్వచ్ఛందంగా తొలగిస్తున్నామని తెలిపాడు. పాటలోని ఆ పదాలను తొలగించి, కొత్త పదాలను చేర్చి పాటను రూపొందిస్తున్నామని, త్వరలోనే ఇందుకు సంబంధించిన పాటల సీడీని విడుదల చేస్తామని చెప్పాడు. శివుడికి ప్రీతికరమైన నమక, చమకాల పదాలతో పాటు.. అగ్రహారం, తమలపాకు పదాలు ఇకపై ఆ పాటలో ఉండవు.